Begin typing your search above and press return to search.

ఫ‌స్ట్‌టైమ్ ఎమ్మెల్యే.. 'అదే' టెన్ష‌న్ అవ‌స‌ర‌మా ..!

వచ్చే ఎన్నికలనాటికి టికెట్టు లభించటం లభించకపోవడం అనేది వారు చేసే పనిని బట్టి వారు చేసే అభివృద్ధి, ప్రజల్లో తిరిగే కలివిడితనం వంటి వాటిని ఆధారంగా చేసుకుని చంద్రబాబు నిర్ణయిస్తారు.

By:  Garuda Media   |   14 Dec 2025 11:00 PM IST
ఫ‌స్ట్‌టైమ్ ఎమ్మెల్యే.. అదే టెన్ష‌న్ అవ‌స‌ర‌మా ..!
X

ఫస్ట్ టైం ఎమ్మెల్యేల్లో కొంద‌రికి వచ్చే ఎన్నికలకు సంబంధించిన గజిబిజి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలనాటికి టికెట్టు లభించటం లభించకపోవడం అనేది వారు చేసే పనిని బట్టి వారు చేసే అభివృద్ధి, ప్రజల్లో తిరిగే కలివిడితనం వంటి వాటిని ఆధారంగా చేసుకుని చంద్రబాబు నిర్ణయిస్తారు. రాష్ట్రంలో 134 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉండ‌గా, దాదాపు 60 మందికి పైగా వీరిలో కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక జనసేనలో గెలిచిన వాళ్ళు దాదాపు 80% కొత్తవాళ్లే కనిపిస్తున్నారు.

దీంతో వచ్చే ఎన్నికలనాటికీ టిడిపిలో ఎంతమంది కొత్త వాళ్లకు అవకాశం ఉంటుంది? ఎంత మందికి అవకాశం కల్పిస్తారు? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో శ్రీకాకుళం నుంచి గెలిచిన గోండు శంకర్ వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వాస్తవానికి ఇక్కడ టిడిపిలో పోటీ లేదు. శంకర్ మళ్లీ టికెట్ దక్కించుకునే అవకాశం కూడా ఉంది. కానీ పరిస్థితులు మారే అవకాశం ఉంటుందన్నది గోండు శంకర్ ఆలోచన.

ఎందుకంటే వైసీపీ తరఫున మళ్లీ ధర్మాన ప్రసాదరావు పోటీ చేస్తే అప్పుడు ఈక్వేషన్లు మారతాయి అన్న ఆలోచనలో గోండు శంకరు ఉన్నారు. దీంతో ఇప్పుడు నిరంతరం ఆయ‌న‌ ప్రజల మధ్య తిరుగుతున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్తున్నారు. ఇది ఒక రకంగా చాలా మంచి పరిణామం. అయినప్పటికీ మరోవైపు వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటినుంచి ఆయన ఆలోచన పెట్టుకోవడం వచ్చే ఎన్నికల్లో మన పరిస్థితి ఏంటి అనేది అంతర్గతంగా నాయకులతో చర్చించడం వంటివి ఆసక్తిగా మారాయి.

ఈ ఆలోచన మంచిదేనా? ఆందోళన పడాల్సిన అవసరం ఉందా? అంటే లేదు. కూటమి బలంగా ఉన్నంతవరకు నాయకులకు ఇబ్బంది లేదన్న వాదన వినిపిస్తుంది. సో మొత్తానికి ప్రజల్లో ఉండడం సమస్యలు పరిష్కరించడం పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం వరకు చేస్తే గెలుపు త‌థ్యం. ఇబంది లేదు, కూటమి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అనేక సర్వేలు చెప్తున్నాయి, కాబట్టి అంత ఆందోళన అయితే చెందాల్సిన అవసరం లేదని టిడిపి నాయకులు చెబుతున్నారు,