Begin typing your search above and press return to search.

కొత్తకు టీడీపీ అందలం...రేపటి నాయక దళం

తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కార్యవర్గాలను ఒకేసారి ప్రకటించింది. ఏకంగా 185 మందితో రాష్ట్ర కమిటీని రిలీజ్ చేసింది.

By:  Satya P   |   15 April 2026 8:01 PM IST
కొత్తకు టీడీపీ అందలం...రేపటి నాయక దళం
X

తెలుగుదేశం పార్టీ జాతీయ రాష్ట్ర కార్యవర్గాలను ఒకేసారి ప్రకటించింది. ఏకంగా 185 మందితో రాష్ట్ర కమిటీని రిలీజ్ చేసింది. జాతీయ కమిటీలో అధ్యక్షుడు చంద్రబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కాకుండా జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, జాతీయ అధికార ప్రతినిధులు ఇలా 32 దాకా జాబితా ఉంది. మొత్తం చూస్తే 220 దాకా పదవులు టీడీపీ ప్రకటించినట్లు అయింది. ఇక 26 మందితో పొలిట్ బ్యూరో మెంబర్స్ ని తీసుకున్నారు. ఇందులో అత్యధికులు యువత మహిళలు ఉన్నారు. నాయకత్వ లక్షణాలు చూసిన మీదటనే వీరికి పార్టీ పదవుల్లో చాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. దాంతో రానున్న రోజులలో ఈ పదవులు అందుకున్న వారు మరింతగా రాణిస్తే వారికే పార్టీ ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కూడా ఇచ్చి ప్రోత్సహించే అవకాశాలు అధికంగా ఉన్నాయని అంటున్నారు.

మండల స్థాయి నేతకు :

రాష్ట్ర కమిటీలో చూస్తే ఒక మండల స్థాయి మహిళా నేతకు నేరుగా చాన్స్ దక్కింది. దానికి కారణం ఆమె పనితీరు అని అంటున్నారు. అలాగే అనేక మంది నాయకులకు రాష్ట్ర జాతీయ కార్యవర్గాలలో చోటు ఇచ్చారు. ఇదంతా వారి పని తీరు ప్రతిభ ఆధారంగానే అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే టీడీపీ దగ్గరుండి మరీ పార్టీ నేతల పనితీరుని గమనిస్తోంది. అధ్యయనం చేస్తోంది. ఎవరు బాగా పనిచేస్తున్నారు అని గుర్తించి మరీ వారికి మార్కులు వేయడమే కాదు అందలాలు ఎక్కిస్తోంది.

కొత్త నెత్తురుతోనే :

టీడీపీలో అనుభవం కలిగిన వారిని ఉంచుతూనే ఎక్కువగా యువతకు పెద్ద పీట వేశారు. అంటే దీని అర్ధం పార్టీకి కొత్త నెత్తురు ఎక్కించాలని అని అంటున్నారు. 26 మందితో రూపొందించిన పొలిట్ బ్యూరోలో ఎపుడూ కనిపించే పేర్లు ఈసారి లేవు. ఆ ప్లేస్ లో ఎంతో మంది కొత్త వారు వచ్చి చేరారు నారా లోకేష్ పదే పదే చెబుతున్నట్లుగా ఎవరైనా పొలిట్ బ్యూరోలోకి రావచ్చు. వారి నాయకత్వ పటిమ ఆధారంగానే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా చెప్పిన మాట ప్రకారమే అధినాయకత్వం అవకాశాలను అందించింది అనుకోవాలి ఉంది. ఒక విధంగా టీడీపీ అంటే ఎంతో మంది సీనియర్ల పేర్లు వినిపిస్తాయి. ఈసారి కొత్త వారిని ముందుకు తీసుకుని రావడం ద్వారా రేపటి రోజున వారిని కూడా మరింతగా ప్రోత్సహించి పార్టీని మరో నాలుగు దశాబ్దాల పాటు బలోపేతం చేసుకునే దిశగా తీసుకున్న కీలక నిర్ణయంగా అంతా చూస్తున్నారు.

మూడవ వంతు వారికే :

ఇక దేశంలో మహిళా రిజర్వేషన్లు కనుక అమలులోకి వస్తే మూడవ వంతు సీట్లు వారి పరం అవుతాయి. అలా చూస్తే ఏపీలో 88 సీట్లకు మహిళా అభ్యర్థులు ఉంటారు దాంతో టీడీపీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పెద్ద ఎత్తున మహిళలను ప్రోత్సహ్స్తోంది. అందులో కూడా ఎక్కువ మంది యువతకే చాన్స్ ఇస్తోంది. అలాగే ఈసారి ఎక్కువగా సీట్లు పెరుగుతాయి కాబట్టి కొత్త వారికి కూడా చాన్స్ ఇవ్వాలని చూస్తోంది. దీని వల్ల పార్టీ సరికొత్త గ్లామర్ తో జనంలోకి వెళ్తుందని పార్టీ పని తీరులో కూడా గణనీయమైన మార్పు ఉంటుందని భావిస్తున్నారు. అలాగే కొత్త తరం ఆలోచనతో టీడీపీ సైకిల్ మరింతగా పరుగులు పెడుతుందని కూడా అధినాయకత్వం న్యూ విజన్ తో ఈ నిర్ణయాలు తీసుకుంది. ఏది ఏమైనా టీడీపీ జాతీయ రాష్ట్ర కార్యవర్గాల ఎంపిక చూసిన తరువాత ఇది భేష్ అయిన ఎంపిక అని అంతా అంటున్నారు. టీడీపీకి మరింత మంచి భవిష్యత్తుని అందించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఇక పదవులు అందుకున్న వారు కష్టపడితే వారికి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని కూడా చెబుతున్నారు.