Begin typing your search above and press return to search.

పుట్టా మహేష్ ఎపిసోడ్...టీడీపీ సైలెంట్...రీజనేంటి ?

ఏలూరుకు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ హైదరాబాద్ లో ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఒక్కసారిగా కదిలించింది.

By:  Satya P   |   16 March 2026 6:15 PM IST
పుట్టా మహేష్ ఎపిసోడ్...టీడీపీ సైలెంట్...రీజనేంటి ?
X

ఏలూరుకు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ హైదరాబాద్ లో ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఒక్కసారిగా కదిలించింది. ప్రత్యేకంగా టీడీపీలో చూస్తే కనుక ఇది అతి పెద్ద షాకింగ్ గా మారింది. డ్రగ్స్ కేసులో సామాన్య నాయకుడు ఎవరైనా ఇరుక్కుంటే ఆ కధ వేరు, కానీ ఒక పార్లమెంట్ సభ్యుడు ఇందులో ఉన్నారు అన్న ప్రచారం దాని మీద ఆరోపణలు ఇవన్నీ చూసినపుడు తెలుగుదేశం పార్టీలో ఇది అతి పెద్ద చర్చలు దారి తీస్తోంది. అంతర్గతంగానే తీవ్ర స్థాయిలో ఈ ఇష్యూ మీద నాయకుల మధ్య చర్చ సాగుతోంది అని అంటున్నారు.

కడప నుంచి తెచ్చి:

ఇదిలా ఉంటే ఎక్కడో కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన పుట్టా మహేష్ కి గోదావరి జిల్లాలలో గుండె కాయ లాంటి ఏలూరు పార్లమెంట్ సీటు ఇవ్వడమే పెద్ద తప్పు అన్నట్లుగా కూడా పార్టీలో అంతర్గత చర్చ సాగుతోంది అని అంటున్నారు. గోదావరి జిల్లాలో ఉన్న స్థానికులను కాదని ఈ సీటు ఎలా ఇస్తారు అని ఆనాడే పార్టీలో ఒక అసంతృప్తి అయితే వ్యక్తం అయింది. కానీ అది ఇపుడు మరోసారి గట్టిగా చర్చకు దారి తీసే స్థాయిలో వినిపిస్తోంది అని అంటున్నారు. స్థానికంగా రెండు సార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి బాబు లాంటి పెద్ద నాయకులు ఉండగా వలసవాదులకు టికెట్లు ఇవ్వాలనుకోవడమే అధిష్టానం నాడు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ అని చర్చ కూడా సాగుతోంది అంటున్నారు. ఏరి కోరి ఆయనను తెచ్చి మరీ టికెట్ ఇవ్వడం ద్వారానే ఇపుడు ఇబ్బందులు పడాల్సి వస్తోంది అన్న కోణంలోనూ చర్చ సాగుతోంది అని అంటున్నారు.

కుట్ర జరిగిందా :

ఇదిలా ఉంటే టీడీపీ అభిమానులు యాక్టివిస్టులు కొంతమంది అయితే సోషల్ మీడియాలో మాత్రం పుట్టా మహేష్ ని సమర్థిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంలో మహేష్ కి అన్యాయం జరుగుతోందని, ఆయన బీసీ నేత కావడం వల్లనే ఈ రకంగా చేస్తున్నారు అని కూడా అంటున్నారు. అయితే ఈ కేసు విషయంలో మాత్రం టీడీపీకి అంతా ఇరకాటమైన పరిస్థితి ఉందని అంటున్నారు బయటకు నేతలు ఎవరూ బాహాటంగా ఏదీ చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. ఎలా రియాక్ట్ కావాలి అన్నది కూడా ఎవరికీ అర్ధం కావడం లేదని అంటున్నారు.

పార్టీకే ట్రబుల్ గా :

మరో వైపు చూస్తే టీడీపీని అభిమానించే వారి వాదన మరోలా ఉంది. కొందరినాయకులు చేసే తప్పులు పొరపాట్ల వల్లనే పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని అంటున్నారు. అయినా సరే ఇది సున్నితమైన అంశంగానే పార్టీలో ఉందని చెబుతున్నారు. బీసీ నేత యువ నాయకుడు, మరో సీనియర్ నేతకు బంధువు ఇలా పుట్టా మహేష్ చుట్టూ చాలా విషయాలు కోణాలు ఉన్నాయి. దాంతో ఎవరూ బయటపడి గట్టిగా అనే పరిస్థితి లేదని కూడా గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో బీసీ నేత మీదకు గురి పెడతారా అని వైసీపీ లాంటి ప్రత్యర్థి పార్టీల మీద విరుచుకు పడాలనుకున్నా ఈ కేసు క్లియర్ కట్ గా ఇపుడు కనిపిస్తోంది అని అంటున్నారు.

బెయిల్ ఇచ్చినా కూడా :

ఇక ఈ కేసు విషయంలో ఎంపీగా పుట్టా మహేష్ కి పోలీసులు తాత్కాలికంగా బెయిల్ ఇచ్చారని అంటున్నారు. ఎందుకు అంటే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎంపీగా సభకు హాజరయ్యేందుకు ఆయనకు ఈ బెయిల్ వచ్చింది అని చెబుతున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో పార్టీగా టీడీపీయే కార్నర్ అవుతోంది అని అంటున్నారు సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి పార్టీ వెళ్తోంది అన్న ఆవేదన కూడా చాలా మంది పార్టీ నేతలలో ఉంది. అందుకే పార్టీలో ఒక రకమైన సైలెంట్ కనిపిస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ తరహా పరిణామాలతో టీడీపీ కానీ కూటమి నేతలు కానీ ప్రస్తుతానికి మౌనంగానే ఉంటూ వస్తున్నారు. ఈ ఇష్యూలో ఏమి జరుగుతుంది ఎటు మలుపు తిరుగుతుంది అన్నది అయితే చూడాల్సి ఉందని అంటున్నారు.