Begin typing your search above and press return to search.

ఏపీలో 72 మంది ఎమ్మెల్యేల‌కే గుడ్ రిపోర్ట్‌....!

ఏపీ అధికార పార్టీ టీడీపీలో `చేసుకున్న వారికి చేసుకున్నంత‌` అనే మాట వినిపిస్తోంది. కొంద‌రు ఎమ్మె ల్యేలు.. ప‌నితీరులో ముందుంటే.. మ‌రికొంద‌రు వెనుక‌బ‌డుతున్నారు.

By:  Garuda Media   |   7 May 2026 2:00 PM IST
ఏపీలో 72 మంది ఎమ్మెల్యేల‌కే గుడ్ రిపోర్ట్‌....!
X

ఏపీ అధికార పార్టీ టీడీపీలో 'చేసుకున్న వారికి చేసుకున్నంత‌' అనే మాట వినిపిస్తోంది. కొంద‌రు ఎమ్మె ల్యేలు.. ప‌నితీరులో ముందుంటే.. మ‌రికొంద‌రు వెనుక‌బ‌డుతున్నారు. ముందున్న నాయ‌కులు.. త‌మ‌కు అంతాబాగుంద‌ని చెబుతున్నారు. వెనుక‌బ‌డుతున్నవారు.. నెపాన్ని స‌ర్కారుపైనో.. అధికారుల‌పైనో నెట్టేస్తున్నారు. దీంతో ఇటీవ‌ల క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై పార్టీ ఆరా తీసింది. అస‌లు ఏం జ‌రుగుతోందో తెలుసుకుంది.

135 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. 72 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ప‌రిస్థితి బాగుంద‌ని పార్టీకి రిపోర్టులు వ‌స్తున్నాయి. మ‌రి మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితి ఏంటి? అనేది ప్ర‌శ్న‌. ఇదే అస‌లు స‌ర్వేకు కార‌ణ‌మైంది. నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ది విష‌యంలో నాయ‌కులు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌వి.. 72 చోట్ల మాత్ర‌మేన‌ని అర్ధ‌మైంది. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉండ‌డ‌మే కాకుండా కేంద్రం అందిస్తున్న ప‌లు ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకుంటున్నారు.

త‌ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఆధార‌ప‌డ‌కుండా.. నిధులు స‌మ‌కూర్చుకుంటున్నారు. ఇలాంటి వాటిలో అనంత‌పురంలో మూడు నియోజ‌క‌వ‌ర్గాలు.. చిత్తూరులో నాలుగు.. నెల్లూరు 3 ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నియోజ‌క‌వ‌ర్గాల లెక్క తేలింది. వీటిలో ఎంపీలతో స‌మ‌న్వ‌యం అవుతున్న ఎమ్మెల్యేలు.. వారికి స‌హ‌క‌రిస్తున్న ఎంపీలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగానేఉంది. కానీ, ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ ఎంపీల మ‌ధ్య వివాదాలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయా నియోజ‌క‌వ‌ర్గాలు వెనుక‌బ‌డుతున్నాయ‌ని పార్టీ గుర్తించింది. దీంతో ఎమ్మెల్యేలు-ఎంపీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం.. పార్టీ క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌నుంది. దీనికి సంబంధించి కార్యాచ‌ర‌ణ కూడా పూర్త‌యింది. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్క త‌ర‌హా రాజ‌కీయం చేస్తుండ‌డాన్ని పార్టీ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంది. చేసుకునేందుకు.. చేసేందుకు కూడా అవ‌కాశం ఉండి కూడా.. ఎమ్మెల్యేలు దూరంగా ఉన్న‌వారిని గుర్తించి.. వారి విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఈ విష‌యంలో గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ‌, తూర్పు గోదావ‌రి, విజ‌య‌న‌గ‌రం జిల్లాలుముందు వ‌రుస‌లో ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.