Begin typing your search above and press return to search.

ఆ టీడీపీ నేత స్టైలే వేరు... అంతా కాంట్ర‌వ‌ర్సీయే...?

క‌ర్నూలు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల తీరు ఒక్కొక్క‌రిది.. ఒక్కొక్క విధంగా ఉంద‌ని అంటున్నారు.

By:  Garuda Media   |   23 May 2026 3:00 PM IST
ఆ టీడీపీ నేత స్టైలే వేరు... అంతా కాంట్ర‌వ‌ర్సీయే...?
X

క‌ర్నూలు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేల తీరు ఒక్కొక్క‌రిది.. ఒక్కొక్క విధంగా ఉంద‌ని అంటున్నారు. ఈ విష‌యంపై పార్టీలోనే ఎక్కువ‌గా చ‌ర్చ న‌డుస్తోంది. స్థానికంగా వైసీపీ నుంచి వ‌చ్చి.. తిరిగి టీడీపీలో చేరిన ఓ నాయ‌కుడు.. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. వైసీపీ హ‌యాంలోనే మంత్రిగా ప‌నిచేశారు. అయితే.. చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలోనూ త‌న‌కు మంత్రి పీఠం ద‌క్కుతుంద‌ని అనుకున్నారు. కానీ, ఎక్క‌డా అవ‌కాశం రాలేదు.

అయితే నేం.. ఆయ‌న మాత్రం దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓ ఎంపీ పైనే తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తున్నార‌న్న చ‌ర్చ కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అంతే కాదు.. ఎంపీ కంటే.. తానే బ‌లంగా ఉన్నాన‌ని.. ఎంపీకి ఉన్న ఇమేజ్‌ కంటే.. త‌న‌కే ఎక్కువ‌గా ఉంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. ఎమ్మెల్యే, ఆయ‌న సోద‌రుడు క‌లిసి చేసిన ప‌ని.. వివాదానికి దారితీసింది. ఏకంగా.. ఎంపీకి చెందిన కాంట్రాక్టు సంస్థ నుంచే క‌మీష‌న్లు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.

ఈ వ్య‌వ‌హారం పార్టీ అధిష్టానం వ‌ర‌కు చేరింది. అయితే.. ఈ విష‌యంలో స‌ర్దుబాటు ధోర‌ణితో ముందుకు సాగాల‌ని చెప్ప‌డంతో అప్ప‌టికి ఆ స‌మ‌స్య కొంత‌ స‌ర్దుబాటు అయింది. అయితే.. ఆ త‌ర్వాత కూడా.. స‌ద‌రు ఎమ్మెల్యే.. తానే ఎంపీ అన్న‌ట్టుగా జిల్లా వ్యాప్తంగా చ‌క్రం తిప్పుతున్నార‌ట‌.ఈ వ్య‌వ‌హారంపై ఫిర్యాదులు కూడా వ‌స్తున్నాయి. కానీ, మేనేజ్ పాలిటిక్స్‌లో ఆరితేరిన‌.. స‌ద‌రు ఎమ్మెల్యే.. పార్టీ నాయ‌కుల‌ను త‌న దారిలో పెట్టుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ప‌రిస్థితి మైన‌స్‌గా మారిపోయింద‌న్న టాక్‌ వినిపిస్తోంది. పైగా.. ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టే నాయ‌కుడిగా కూడా పేరుండ‌డంతో పార్టీ నాయ‌కులు కూడా.. ఆయ‌న‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ, స‌ద‌రు నేత చేస్తున్న కార్య‌క్ర‌మాల‌తో పార్టీ దెబ్బ‌తింటుంద‌ని.. రేపు ఏదైనా తేడా వ‌స్తే.. స‌ద‌రు నాయ‌కుడు మ‌ళ్లీ పార్టీ మారిపోయే ప్ర‌మాదం కూడా ఉంద‌ని అంటున్నారు. ఈ విష‌యంపై పార్టీ అధిష్టానం ప‌ట్టించుకోవాల‌ని కోరుతున్నారు. తాజాగా ఈ్ వ్య‌వ‌హారం మ‌రోసారి చంద్ర‌బాబు వ‌ర‌కు చేరింది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.