అర్ధమైందా జగన్...లోకేష్ మహా గర్జన
ఇదిలా ఉంటే లోకేష్ తన స్వల్ప ప్రసంగంలో ఒక విధంగా పార్టీకి దిశానిర్దేశం చేశారు అని చెప్పాలి.
By: Tupaki Desk | 28 May 2025 12:03 AM ISTకడప జిల్లాలో జరుగున్న మహానాడులో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్య్దర్శి నారా లోకేష్ చేసిన ప్రసంగం పవర్ ఫుల్ గా సాగింది. కేవలం 18 నిమిషాల స్వల్ప సమయంలోనే ఆయన చెప్పాల్సినవి అన్నీ చెప్పేశారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తూనే విపక్ష వైసీపీ అధినేత జగన్ మీద పరోక్షంగా బిగ్ సౌండ్ చేశారు.
అర్థమైందా రాజా అని మహానాడు వేదికపై నుంచి జగన్ ని గట్టిగానే ప్రశ్నించారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మహిళలకు ఏ మాత్రం గౌరవం లేదని ఆయన అన్నారు. నిండు అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారు అని ఆయన తన తల్లి భువనేశ్వరి మీద నాటి వైసీపీ మత్రులు కీలక ఎమ్మెల్యేలు నేతలు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో ఆనాటి పాలకులు తమ ఏలుబడిలో మహిళలను చులకనగా చూసిన వారు ఈ రోజు దానికి తగిన భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారు అని లోకేష్ అన్నారు.
సొంత తల్లిని చెల్లెలుని ఇంటి నుంచి గెంటేశారు అని జగన్ మీద ఇండరైరెక్ట్ గా సెటైర్లు వేశారు. మహిళల పట్ల పూర్తిగా అగౌవరంగా వ్యవహరించిన వారు ఈ రోజున ఎదుర్కొంటున్న పరిణామాలు ఏమిటో అందరికీ తెలుసు అన్నారు. అందుకే అర్ధమైనా రాజా అని సభలో టీడీపీ క్యాడర్ ని ప్రశ్నించారు. ఆ విధంగా పరోక్షంగా జగన్ ని అర్థమైందా అంటూ ప్రశ్నించారు.
ఏడాది టీడీపీ పాలనలో వైసీపీ నేతల అరెస్టులు వారి మీద చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్న వైనాలను ఆయన ఈ విధంగా ఇండైరెక్ట్ గా చెప్పారని అంటున్నారు. నాడు చేసిన దానికి ఫలితమే ఇవన్నీ అని అర్ధమైందా అని ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు.
ఇదిలా ఉంటే లోకేష్ తన స్వల్ప ప్రసంగంలో ఒక విధంగా పార్టీకి దిశానిర్దేశం చేశారు అని చెప్పాలి. పార్టీకి ఆత్మ గౌరవం ముఖ్యమని ఆయన అన్నారు. కాలం మారుతోంది, ప్రజల ఆలోచనా విధానాలు మారుతున్నాయని గుర్తు చేశారు. ఇక పార్టీ కోసం క్యాడర్ కోసం ఆరు శాసనాలను ప్రతిపాదిస్తున్నామని ఆయన చెప్పారు
తెలుగుదేశం పార్టీ అంటేనే ఆత్మ గౌరవానికి పెట్టింది పేరు అని ఆయన అన్నారు. అన్న దాతలకు పేదలకు అండగా నిలిచేందుకు పుట్టిన పార్టీ అని కూడా అన్నారు. టీడీపీ పేదల పార్టీ అని కూడు గూడూ గుడ్డ పార్టీ మూల సూత్రమని లోకేష్ చెప్పారు. కులం మతం ప్రాంతం అన్న దానికి అతీతంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందని లోకేష్ అన్నారు.
ఇక టీడీపీది సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర అన్నారు. 43 ఏళ్ళ ఈ ప్రస్థానంలో టీడీపీ ఎన్నో ఎత్తు పల్లాలు చూసిందని గుర్తు చేశారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నది ఎన్టీఆర్ నినాదం అన్నారు చంద్రబాబు పార్టీ కోసం ప్రజల కోసం ఎంతో సేవ చేశారు అని ఆయన కొనియాడారు.
సమాజంలో వస్తున్న మార్పులను ఎప్పటికపుడు గమనిస్తూ పార్టీలో చర్చ జరగాలని లోకేష్ కోరారు. మరో నలభై ఏళ్ళ పాటు టీడీపీని నడిపించడానికి అవసరమైన ప్రణాళికలను మహానాడు వేదికగా రూపొందించాలని ఆయన కోరారు. ప్రజల కోసం పార్టీ కోసం కార్యకర్తల కోసం అందుకే ఆరు శాసనాలను రూపొందిసుత్న్నామని ఆయన అన్నారు.
తెలుగు జాతి విశ్వఖ్యాతి అన్నది పార్టీ మొదటి శాసనం అన్నారు ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఉండాలన్నదే తెలుగుదేశం పార్టీ విధానం అని ఆయన చెప్పారు. అలాగే యువగళం పేరుతో తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేయబోతున్నట్లుగా లోకేష్ చెప్పారు.
రాష్ట్రంలో బలమైన యువ శక్తి ఉందని వారిని సరైన అవకాశాలు ఇస్తే వారు అన్ని రంగాలలో దూసుకుని పోతారని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిచడానికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అలాగే స్త్రీ శక్తిని గౌరవించడమే పార్టీ మరో విధానం అన్నారు. మహిళలకు ఆస్తి హక్కులో సగం వాటా ఎన్టీఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తరువాత వారికి ఆర్ధిక స్వాతంత్ర్యం ఇచ్చింది చంద్రబాబు అని లోకేష్ చెప్పారు.
చట్టాలు శిక్షల వల్ల కంటే సమాజంలో మహిళలను గౌరవించాలన్నది ప్రతీ ఇంటి నుంచే మార్పు రావాలని లోకేష్ అన్నారు. మహిళలను ప్రతీ ఒక్కరూ గౌరవిచాలని ఆయన పరోక్షంగా ఆనాటి జగన్ పాలనలో మహిళలను అగౌరపరచిన తీరుని గుర్తు చేశారు.
పేదల సేవలలో టీడీపీ తరించాలని ఆయన కోరారు బీసీలకు టీడీపీ వెన్నుదన్నుగా ఉందని అన్ని వర్గాలలో ఆర్ధికంగా పేదలకు అండగా ఉంటూ ఆదుకోవడానికి టీడీపీ నిరంతరం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. అన్న దాతలకు కూడా తెలుగుదేశం ఎపుడూ పెద్ద పీట వేస్తుందని ఆయన చెప్పారు. అంతే కాదు టీడీపీకి కార్యకర్తే అధినేత అని జగన్ అన్నారు. వారిని గౌరవిస్తూ ఎపుడూ ముందుకు సాగుతుందని పార్టీ కోసం బలి అయిన చంద్రయ్య అనే కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామని ఆయన గుర్తు చేసారు.
టీడీపీకి కోట్లాది మంది సభ్యులు ఉన్నారని దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని బలం ఇదని ఆయన అన్నారు. కార్యకర్తల కోసం పార్టీ నిరంతరం పనిచేస్తుందని లోకేష్ హామీ ఇచ్చారు. ఇలా ఆరు శాసనాలను ఆయన ప్రతిపాదించి వాటిని సభాముఖంగా మద్దతు తీసుకున్నారు. ఈ క్రమంలోనే మహిళల పట్ల గౌరవ పరచ వద్దు ఆ విధానం వద్దు అని జగన్ పాలనలో జరిగిన వాటిని గుర్తు చేశారు.
