Begin typing your search above and press return to search.

వైఎస్సార్ ని కమ్మేసిన పసుపు కెరటం

వైఎస్సార్ మరణించి అక్షరాలా పదహారేళ్ళు అవుతోంది. ఆయన ఉన్నది పక్కాగా కాంగ్రెస్.

By:  Tupaki Desk   |   26 May 2025 8:15 AM IST
వైఎస్సార్ ని కమ్మేసిన పసుపు కెరటం
X

వైఎస్సార్ మరణించి అక్షరాలా పదహారేళ్ళు అవుతోంది. ఆయన ఉన్నది పక్కాగా కాంగ్రెస్. ఆయన కాంగ్రెస్ వాది. తన మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితం మొత్తం ఆయన కాంగ్రెస్ కే అంకితం చేశారు. తనకు ఉన్నత పదవులు దక్కకపోయినా ఆయన ఏ రోజూ పార్టీ గీత దాటలేదు. కాంగ్రెస్ నుంచే సీఎం కావాలని అనుకున్నారు. అలాగే అయ్యారు. అలాంటి వైఎస్సార్ మరణించిన ఇన్నాళ్ళ తరువాత పసుపు కెరటం ఆయనని కమ్మేసింది.

నిజంగా అది ఎవరూ ఊహించనిదే. వైఎస్సార్ జీవించి ఉండగా కడప జిల్లాలో కాంగ్రెస్ దే ఆధిపత్యంగా ఉంటూ వచ్చింది. ఆయన తన సొంత జిల్లాను కంచుకోటగా అలా తయారుచేశారు. ఇక ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎంపీగా కడప జిల్లా నుంచి గెలిచి తనదైన రాజకీయ చరిత్ర సృషించారు. ఆయన ఓటమెరుగని వీరుడిగానూ రికార్డు సృష్టించారు.

ఇక చూస్తే టీడీపీ ఎన్నడూ తమ పార్టీ రాజకీయ సమావేశాలు మహానాడు పేరుతో కడప జిల్లాలో పెట్టిన చరిత్ర లేదు మొదటిసారి టీడీపీ కడప జిల్లాలో మూడు రోజుల పాటు మహానాడుని నిర్వహిస్తోంది. అది కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది.

టీడీపీ ఈ విధంగా నిర్వహించడానికి కారణం ఉంది. కడపలో నూటికి తొంబై శాతం విజయాలను 2024 ఎన్నికల్లో తెలుగుదేశం నమోదు చేసింది. దాంతో పాటు ఇంతకాలం వైసీపీని వెన్నంటి ఉన్న వర్గాలు అంతా ఫ్యాన్ పార్టీకి తిలోదకాలు ఇచ్చేశరా అన్న చర్చ నడచింది. 2024 ఎన్నికల్లో మొత్తం కడప జిల్లాలో పదికి పది స్వీప్ చేసిన వైసీపీకి 2024 ఎన్నికల్లో మాత్రం కేవలం మూడు అంటే మూడు సీట్లే దక్కాయి.

దాంతో ఇదే అదనుగా భావించి టీడీపీ మహానాడుకే అక్కడ నిర్వహించడం ద్వారా వైసీపీని రాజకీయంగా కోలుకోలేకుండా దెబ్బ కొట్టాలని చూస్తోంది. ఇక కడపలో తొలిసారి నిర్వహిస్తున్న టీడీపీ మహానాడుతో కడప మొత్తం పసుపుదనం కమ్ముకుంది. ఎక్కడ చూసినా పసుపు జెండాలు రెపరెపలాడుతునాయి.

అది ఎంతదాకా వచ్చిందంటే కడపలో అతి పెద్ద వైఎస్సార్ విగ్రహాన్ని సైతం చుట్టుముట్టాయి. దాంతో వైఎస్సార్ విగ్రహం దాని చుట్టూ పెద్దగా ఉన్న పోడియం అంతా కూడా పసుపుదనంతో మెరిసిపోతోంది. వైఎస్సార్ విగ్రహం నుంచే జెండాలు నలువైపులా విస్తరించి మరీ మధ్యలో వైఎస్సార్ ని ఉంచేశాయి. దానిని చూసిన వారు అంతా వైఎస్సార్ ని టీడీపీ మనిషిగా చేశారు కదా అని సెటైర్లు వేస్తున్నారు.

ఏది ఏమైనా చూస్తే కనుక ఇది పసుపు తమ్ముళ్ళ పరవశంగా అంతా చెబుతున్నారు. కడపలో పరవళ్ళు తొక్కుతున్న పసుపు కెరటాల మధ్యలో మహా నేతల విగ్రహాలు ఎన్ని ఉన్నా అన్నీ కూడా అదే రంగును అద్దుకుంటూ కొత్త కాంతులీనుతున్నాయని అంటున్నారు.

మొత్తానికి ఏ నాయకుడి విగ్రహం మీద ఏ పార్టీ జెండా తాకినా ఏమో కానీ కాంగ్రెస్ ఖద్దరు పార్టీకి దశాబ్దాలుగా కుదురుకుపోయిన వైఎస్సార్ విగ్రహం అయ్యాక ఆయన చుట్టూ పసుపు జెండాలు అమరడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది అని అంటున్నారు. ఇక ఆయన కుమారుడు జగన్ వైసీపీని స్థాపించి టీడీపీకి బద్ధ రాజకీయ ప్రత్యర్ధి గా మారిన నేపధ్యంలో వైఎస్సార్ విగ్రహం చుట్టూ పసుపు జెండాలు ఉండడం రాజకీయ రచ్చగానే ఉంది అని అంటున్నారు.