Begin typing your search above and press return to search.

దేవుని గడపలో మహానాడు సూపర్ హిట్.. ఆనందభాష్పాలతో శ్రీనివాస్ రెడ్డి!

ఈ సందర్భంగా.. మహానాడు ఏర్పాట్లను చూసి సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు... రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డిని భుజం తట్టి మెచ్చుకున్నారు.

By:  Tupaki Desk   |   29 May 2025 6:34 PM IST
దేవుని గడపలో మహానాడు  సూపర్  హిట్.. ఆనందభాష్పాలతో శ్రీనివాస్  రెడ్డి!
X

కడపలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహానాడు మూడోరోజు భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వేదికపై చంద్రబాబు.. ఈ మహానాడు ప్రత్యేకతను వివరించారు. ఈ సందర్భంగా రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డిని అభినందించగా.. ఆయన భావొద్వేగానికి గురయ్యారు!

అవును... కడపలో తొలిసారిగా టీడీపీ నిర్వహించిన మహానాడులో మూడోరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... ఒక్కోసారి జీవితాల్లో కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయని.. ఈ రోజు కడప సంఘటన కూడా మీరంతా మంచి చేస్తే మీరంతా తోడుగా ఉంటారని మరోసారి నిరూపించారని తెలిపారు.

"నేను చాలా మహానాడులు చూశాను.. కార్యకర్తలు ఓ రకంగా వచ్చేవారు కానీ.. ఈసారి మాత్రం ప్రతిక్షణ, అనుక్షణం శ్రద్ధగా కూర్చున్నారు. బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నా.. అన్ని దారులూ కడప వైపే. కడప అష్టదిగ్భందనం అయిపోయింది.. ఈ గ్రౌండ్ తెల్లవారుతూనే ఫుల్లైపోయింది" అని చంద్రబాబు అన్నారు.

ఇదే సమయంలో.. "గతంలో టైం కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా మొదలయ్యేది కానీ ఈ సారి మాత్రం టైం కంటే మూడు గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది. ఏం తమ్ముళ్లూ మీ రుణం తీర్చుకోవాలి.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి మహానాడు దేవుని గడపలో జరిగింది.. రెస్పాన్స్ అదిరింది.. సూపర్ హిట్టయ్యింది" అని హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా.. మహానాడు ఏర్పాట్లను చూసి సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు... రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డిని భుజం తట్టి మెచ్చుకున్నారు. దీంతో.. శ్రీనివాస్ రెడ్డి ఆనందభాష్పాలతో చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.

దీనిపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన శ్రీనివాస్ రెడ్డి... కడపలో మహానాడు నిర్వహించి మమ్మల్ని గౌరవించిన పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకి తన జీవితాంతం కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ సందర్భంగా... బహిరంగ సభ వేదికపై, నా మనసులో కలిగిన భావోద్వేగం మాటల్లో చెప్పలేనిదని.. ఆ క్షణం కన్నీళ్లుగా బయటపడిందని తెలిపారు.