మహానాడు ముగిసింది.. తమ్ముళ్లు వాట్ నెక్ట్స్ ... !
నారా లోకేష్ తొలిసారి ప్రకటించిన ఆరు శాసనాలను తమ్ముళ్లు క్షేత్రస్థాయిలో వివరించాల్సిన కీలకమైన బాధ్యతను చెప్పకనే చెప్పారు.
By: Tupaki Desk | 31 May 2025 7:00 AM ISTమహానాడు ముగిసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలిసారి నిర్వహించిన మహానాడుకు తొలిసారి.. కడప వేదిక అయింది. ఈ మహానాడు ద్వారా అనేక అంశాలు చర్చకు వచ్చాయి. తొలిసారి.. నారా లోకేష్.. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో మహానాడుకు ఆరు శాసనాలు అందించారు. ఇక, పార్టీ సిద్ధాంతాలను చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మహానాడు ముగిసిందని చేతులు దులుపుకొనే నాయకులకు, కార్యకర్తలకు.. అనేక అంశాలను లక్ష్యాలుగా ప్రకటించారు.
ఏంటా లక్ష్యాలు..?
నారా లోకేష్ తొలిసారి ప్రకటించిన ఆరు శాసనాలను తమ్ముళ్లు క్షేత్రస్థాయిలో వివరించాల్సిన కీలకమైన బాధ్యతను చెప్పకనే చెప్పారు. ఆరు శాసనాలు కాదు.. ఆరు ఊపిరులుగా భావించాలని.. చంద్రబాబు చెప్పిన మాట ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుతూ.. రూపొందించిన ఈ ఆరు శాసనాలను ఆయా వర్గాలకు చేరువ చేయడం.. అనే ప్రక్రియ ఇప్పుడు.. నాయకులు, కార్యకర్తల పైనే ఉంది. అంతేకాదు.. ఎవరూ ఈ విషయంలో అప్రమత్తత కోల్పోరాదన్న సంకేతాలు ఇచ్చారు.
అదేవిధంగా సమకాలీన రాజకీయ అంశాలపైనా తమ్ముళ్లకు మహానాడు కీలక కర్తవ్య నిష్ఠను కల్పించింది. ప్రత్యర్థి ఇప్పుడు బలహీనంగా ఉండొచ్చు.. కానీ, మళ్లీ పుంజుకోవచ్చు. ఈ అవకాశం ఇవ్వకుండా.. ఎప్పటి కప్పుడు.. వైసీపీ పాలనలో జరిగిన అకృత్యాలను ప్రజలకు చెప్పడం ద్వారా.. వారు వైసీపీ వైపు చూడకుం డా వ్యవహరించాలన్న బృహత్ సంకల్పాన్ని మహానాడు తమ్ముళ్ల ముందు పెట్టింది. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని పేర్కొంది.
ఇక, కంటిన్యూ గవర్నెన్స్(ఇదే ప్రభుత్వం మళ్లీ మళ్లీ కొనసాగేలా) అనే అంశంపై కీలక ప్రతిపాదనను కూ డా మహానాడు తమ్ముళ్లకు వివరించింది. ఓడడం.. గెలవడం.. మళ్లీ ఓడడం.. అనే మంత్రాన్ని పక్కన పె ట్టి.. గుజరాత్ మోడల్‌ను అందిపుచ్చుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుని ప్రజల ను ట్యూన్ చేయడం ఇప్పుడు నాయకులచేతిలోనే ఉంది. మళ్లీ మళ్లీ ఇదే ప్రభుత్వం కొనసాగితే.. అప్పుడు.. అభివృద్ధి కుంటు పడదన్న విషయాన్నినాయకులు ప్రజల మధ్యకు వెళ్లి వివరించేలా మహానాడుకీలక కర్తవ్య బోధ చేసింది. మరి తమ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.
