మహానాడుతో పెరిగిన ధీమా
ఏపీలో బలమైన రాజకీయ పార్టీగా సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీగా టీడీపీ ఈ మహానాడుతో నిరూపించుకుంది.
By: Tupaki Desk | 29 May 2025 8:00 AM ISTతెలుగుదేశం పార్టీకి ఒక పండుగగా మహానాడుని నిర్వహిస్తారు. ఈసారి కడపలో అలాగే నిర్వహించారు. మహానాడు మీద ఈసారి నారా లోకేష్ ముద్ర అధికంగా పడింది గతానికి ఇప్పటికీ భిన్నం ఏమిటి అంటే చంద్రబాబు కంటే ఎక్కువగా ఫోకస్ లోకేష్ మీద ఉండడం. అంతే కాదు ఈసారు ఆరు శాసనాలు పేరుతో లోకేష్ ప్రతిపాదించిన అంశాల మీద చర్చ సాగింది.
మరో వైపు చూస్తే ప్రతీ సారి ఒక తీర్మానానికి ముందూ వెనక చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించేవారు. అలాగే నాయకులు కూడా కొంచెం ఎక్కువ సమయం తీసుకునేవారు. దాంతో అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం అయ్యేది. కానీ ఈసారి మాత్రం అనుకున్న సమయానికే సభను ముగించారు. సుదీర్ఘమైన ఉపన్యాసాలు లేవు. అంతా టైం చూసుకుని మరీ అర్ధవంతమైన నాణ్యమైన ప్రసంగాలు చేశారు.
ఒక విధంగా అంతా సిస్టమేటిక్ గా జరిగిపోయింది. దాంతో లోకేష్ మార్క్ ఈసారి మహానాడు మీద స్పష్టంగా ఉంది అని అంతా అంటున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే ఈసారి మహానాడు పూర్తి స్థాయి ఆత్మ విశ్వాసంతో ధీమాత సాగింది. మరో నాలుగు దశాబ్దాల పాటు టీడీపీ జెండాకు తిరుగులేదు అన్న నిబ్బరాన్ని అటు నాయకులకూ ఇటు క్యాడర్ కి కూడా ఇచ్చింది.
చంద్రబాబు తర్వాత ఎవరూ అన్న ప్రశ్న 2023లో నిర్వహించిన మహానాడు దాకా ఉండేది. కానీ ఈసారి మహానాడుకి మాత్రం అది ఏ మాత్రం కనిపించలేదు. నారా లోకేష్ భవిష్యత్తు నాయకుడిగా ఎదగడమే అందుకు కారణం అని అంటున్నారు. ఇక నాయకులు అంతా లోకేష్ కి ప్రమోషన్ ఇవ్వాలని కోరడం జరిగింది. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని బాబుని వినతి చేయడం జరిగింది.
ఆ విధంగా చూస్తే యువ నాయకత్వం టీడీపీకి ఉందని అది పదిలంగా ఉందని బాబు తరువాత లోకేష్ చేతిలో పార్టీ పూర్తి భద్రతతో ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఆ సన్నివేశం అయితే ఈసారి మహానాడులో కనిపించింది. దాంతో మహానాడులో అనుకున్న లక్ష్యం అయితే నెరవేరింది అని అంటున్నారు.
ఏపీలో బలమైన రాజకీయ పార్టీగా సుదీర్ఘమైన చరిత్ర ఉన్న పార్టీగా టీడీపీ ఈ మహానాడుతో నిరూపించుకుంది. ఇక క్యాడర్ కి ప్రాధాన్యత అని చెప్పడం వారినే అధినాయకత్వంగా గుర్తిస్తామని చంద్రబాబు లోకేష్ గట్టి భరోసా ఇవ్వడంతో క్యాడర్ లో ఫుల్ జోష్ కనిపించింది. అంతే కాదు యువతకు పెద్ద పీట వేస్తామని రానున్న రోజులు అన్నీ యువతరానివే అని చెప్పడం ద్వారా వారిలోనూ కొత్త ఆశలు కల్పించారు. అంతే కాదు కష్టపడి పనిచేస్తే కీలక పదవులు మీ సొంతం అని కూడా చెప్పకనే చెప్పారు. మొత్తానికి ఈసారి మహానాడుతో మరో నాలుగు దశాబ్దాల పాటు పసుపు జెండా రెపరెపలాడేలా ఉత్సాహం కనిపించింది అని అంతా అంటున్నారు.
