తమ్ముళ్లు హ్యాపీ: బాబు కీలక నిర్ణయం ..!
ఇది నిజంగానే.. పార్టీలో ఉత్సాహాన్ని కల్పిస్తున్న వ్యవహారం. అంతేకాదు.. ఈ కమిటీల్లో మెజారిటీ క్షేత్రస్థా యి నాయకులకు కూడా ప్రాధాన్యం దక్కించింది.
By: Tupaki Desk | 22 May 2025 9:00 PM ISTఈ నెల 27-29 తేదీల మధ్య జరగనున్న మహానాడుకు చాలానే ప్రత్యేకత ఉంది. తొలిసారి కడప జిల్లాలో నిర్వహించడంతోపాటు.. ఈ దఫా సంచలనం ఏదో చోటు చేసుకునే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. పార్టీలో కీలక పదవికి మంత్రి నారా లోకేష్‌ను ఎంపిక చేసి.. దాదాపు పార్టీ బాధ్యతలను ఆయ నకు అప్పగిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఈ మహానాడుకు ప్రత్యేకత ఏర్పడింది. మరోవైపు.. యువతకు పెద్దపీట వేసే క్రమంలో చంద్రబాబు కీలక ప్రకటన చేస్తారని కూడా తెలుస్తోంది.
దీంతో సహజంగానే పార్టీలో ఉత్సాహ పూరిత వాతావరణం నెలకొంది. ఇదేసమయంలో మరింత సంతోషా న్ని ఇస్తూ.. చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం మరింతగా తమ్ముళ్లు ఖుషీ అయ్యేలా చేస్తోంది. అదే .. మహానాడు కమిటీలు. ఏకంగా 19 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇది గతానికి చాలా భిన్నంగా ఉందని సీనియర్లు చెబుతున్నారు. గతంలో కేవలం 5-6 కమిటీలను మాత్రమే ఏర్పాటు చేసేవారు. కానీ.. ఈ దఫా మాత్రం చాలా అనూహ్యంగా 19 కమిటీలను ఏర్పాటు చేశారు.
ఇది నిజంగానే.. పార్టీలో ఉత్సాహాన్ని కల్పిస్తున్న వ్యవహారం. అంతేకాదు.. ఈ కమిటీల్లో మెజారిటీ క్షేత్రస్థా యి నాయకులకు కూడా ప్రాధాన్యం దక్కించింది. మంత్రులకు బాధ్యతలు అప్పగించినా.. ఒక్కొక్క కమిటీలో కనీసం 10 మందికి తగ్గకుండా నాయకులను నియమించారు. దీంతో సదరు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గతంలో కొందరు పెద్ద నేతలు మాత్రమే ఏర్పాట్లలో పాలు పంచుకునే వారు. కానీ.. ఈ దఫా వ్యూహం మార్చి మహానాడుకు అందరికీ అవకాశం కల్పించారు.
తద్వారా ప్రస్తుతం నిర్వహిస్తున్న మహానాడు గ్రాండ్ సక్సెస్ చేయాలన్న చంద్రబాబు ఆలచన ఫలిస్తుంద న్న అంచనాలు ఉన్నాయి. అంతేకాదు.. కడపలో నిర్వహించడం ద్వారా.. వైసీపీకి బలమైన సంకేతాలు కూడా ఇవ్వనున్నారు. అదేవిధంగా టీడీపీలో చేరికలను కూడా ప్రోత్సహించనున్నట్టు తెలిసింది. మహానాడు వేదికగా భారీ సంఖ్యలో నాయకులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాలే తమ్ముళ్లలో ఖుషీ నింపుతుండడం గమనార్హం.
