టీడీపీ - ఒక శక్తి - మహాయుక్తి ..!
కానీ, దానిని నాలుగు దశాబ్దాలకు పైగా నవనవోన్మేషంగా ముందుకు నడిపించడం .. అత్యంత శక్తిమంతంగా ముందుకు సాగించడం కత్తిమీద సాములాంటి కసరత్తే.
By: Tupaki Desk | 29 March 2025 6:54 PM ISTపాతతరం నుంచి కొత్త తరానికి వారధిగా మారాలంటే.. ఒక పార్టీకి అంత తేలిక కాదు. పార్టీ పెట్టడం తేలిక. కానీ, దానిని నాలుగు దశాబ్దాలకు పైగా నవనవోన్మేషంగా ముందుకు నడిపించడం .. అత్యంత శక్తిమంతంగా ముందుకు సాగించడం కత్తిమీద సాములాంటి కసరత్తే. ప్రస్తుతం దేశంలోని చాలా పార్టీలు.. టీడీపీ తర్వాత ఆవిర్భవించినవే. అయితే.. వాటికి నాయకత్వ కొరత వెంటాడుతోంది. ఉదాహరణకు అన్నాడీఎం కే.. తమిళనాట జయలలిత ఉన్నంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు.. నాయకత్వం లేక ఈసురోమంటోం ది.
అదేవిధంగా కర్నాటకలో టీడీపీ తర్వాత ఏర్పడిన పార్టీ.. జేడీఎస్. మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలో ఏర్పడిన జేడీఎస్ పార్టీ.. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. సొంతంగా ఒక్కసారి కూడా అధికారం దక్కించుకున్న చరిత్రలేదు. ఇక, ఇప్పుడు కుటుంబంలో చీలికలు.. తద్వారా ఏర్పడిన శూన్యత కారణంగా.. పార్టీ నాయకత్వ కొరతను ప్రత్యక్షంగా ఎదుర్కొంటోంది. ఇక, ఒడిసాలో టీడీపీతో సమానంగా ఏర్పడిన పార్టీ.. బీజేడీ. సొంతగానే అధికారం దక్కించుకున్నప్పటికీ.. ఇప్పుడు నవీన్ పట్నాయక్ వృద్ధుడు కావడంతో పార్టీని నడిపించేందుకు కీలక నేతలు ఎవరూ లేకపోవడం మరో విషయం.
ఇలా ప్రాతీయ పార్టీల వ్యవహారం.. రోజు రోజుకు దిగనాసిగా మారుతున్నప్పటికీ.. తెలుగునాట ఆత్మగౌరవ నినాదంతో పాదుర్భవించిన తెలుగు దేశం పార్టీకి నాయకుల కొరతేకాదు.. నాయకత్వ కొరత కూడా లేక పోవడం గమనార్హం. మరో 30 ఏళ్ల వరకు తిరుగులేని అమేయ శక్తిగా టీడీపీ తన మార్గంలో ప్రయాణం చే సేందుకు పునాదుల బలం అమేయమనే చెప్పాలి. ఒక పార్టీ జీవిత కాలం ఎంత? అంటే.. ఏర్పాటు చేసుకున్న సిద్ధాంతాల ఆధారంగా ఇది ముడి పడి ఉంటుంది.
కాలం చెల్లిన సిద్ధాతాలను పట్టుకుని పాకులాడుతున్న కమ్యూనిస్టుల పరిస్థితిని గమనిస్తే.. పార్టీల జీవితం ఎంతో అర్ధమవుతుంది. కానీ, టీడీపీకి ఉన్న సిద్ధాంతాలు.. నిత్య నూతనం సంతరించుకున్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ.. భవిష్యత్తును దర్శనం చేయడంలోనే ఒక పార్టీ జీవిత కాలం ఆధారపడి ఉంటుంది. గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా.. ముందుకు సాగుతున్న టీడీపీకి.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు ఎలాంటి తావు లేకపోవడం గమనార్హం.
