జవహర్‌కు బాబు గ్రీన్ సిగ్నల్.. తెరవెనక ఏం జరిగింది ..!
టీడీపీ మాజీ మంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్‌కు సీఎం, టీడీపీ అధినే త చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 14 April 2025 7:00 AMటీడీపీ మాజీ మంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్‌కు సీఎం, టీడీపీ అధినే త చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన జవహర్.. కొన్నాళ్లుగా మౌనంగా ఉన్నారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పార్టీ తరఫున , ప్రభుత్వం తరఫున బలమైన గళం వినిపించారు. ముఖ్యంగా వైసీపీలోని ఎస్సీ నాయకులు చేసే విమర్శలకు బలమైన కౌంటర్లు కూడా ఇచ్చారు.
అయితే.. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కని దరిమిలా.. జవహర్ మౌనంగా ఉంటున్నారు. పైగా.. ఆ యన సొంత నియోజకవర్గం తిరువూరులోనే ఏదో పొరుగు నేతను చూస్తున్నట్టుగా చూస్తున్నారన్న విమ ర్శలు కూడా ఉన్నాయి. తిరువూరు నియోజకవర్గం నుంచి 2019లో పోటీ చేసిన జవహర్.. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయన ఓడిపోయారు. ఇక, 2024కు వచ్చే సరికి ఆయన గ్రాఫ్ పెరిగినప్పటికీ.. గుంటూరు జిల్లాకు చెందిన కొలికపూడి శ్రీనివాసరావును చంద్రబాబు ఎంచుకున్నారు.
ఈ క్రమంలో నామినేషన్ల ఘట్టానికి ముందు అనూహ్యంగా కొలిక పూడికి ఇక్కడి టికెట్ ఇచ్చారు. దీంతో జవహర్ హర్ట్ అయ్యారు. ఇక, అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యాలయానికి కూడా రావడం తగ్గించారు. అయితే.. చంద్రబాబు పెట్టుకున్న ఆశలు.. ఆయన వ్యూహాలను కొలిక పూడి ఛిద్రం చేశారన్న చర్చ పార్టీలో ఉంది. దీంతో చంద్రబాబు మరోసారి జవహర్ వైపు చూస్తున్నారు. తాజాగా దేవినేని ఉమా కుమారుడి ఫంక్షన్ లోనే జవహర్‌తో చంద్రబాబు చర్చించినట్టు తెలిసింది.
నియోజకవర్గంలో యాక్టివ్ కావాలని.. ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని.. ఆయన జవహర్ కు సూచించినట్టు సమాచారం. అంతేకాదు.. ఏ అవసరం వచ్చినా.. నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కూడా.. చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. దీంతో జవహర్ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జవహర్ సుప్తచేతనావస్థలో ఉండడం.. కొలిక పూడి వివాదాలకు కేంద్రంగా మారడంతో వైసీపీ పుంజుకునే పరిస్థితి వచ్చింది. దీనికి అడ్డుకట్ట వేస్తూ.. ఉభయ కుశలోపరి అన్నట్టుగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం.. తిరువూరు టీడీపీలో జోష్ నింపుతోంది.