బాబు+పవన్ - కార్యకర్తలు = కూటమి ..!
ఇది అంతర్గతంగా కార్యకర్తలపై ప్రభావం చూపుతోంది. నాయకులను బట్టే కార్యకర్తలు పనిచేస్తారు. నాయకులు ఎలా ఉంటే కార్యకర్తలు కూడా అలానే ఉంటారు.
By: Tupaki Desk | 14 Jun 2025 10:30 PMకూటమి బలంగానే ఉంది. ఏడాది పాలన తర్వాత కూడా.. ఎక్కడా పైకి విభేదాలు కనిపించలేదు. కనిపించడమూ లేదు. దీనికి ప్రధాన కారణం.. చంద్రబాబు + పవన్ కల్యాణ్‌లు బలంగా ముందుకు సాగుతుండ డమే. బీజేపీ కూడా కూటమిలోనే ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. ఇక, ప్రధానంగా ముఖ్యమంత్రి=ఉప ముఖ్యమంత్రి మాత్రమే పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అయితే.. ఇది పైకి కనిపిస్తున్న వాస్తవం.
క్షేత్రస్థాయిలో మాత్రం కార్యకర్తల మధ్య కలివిడి కనిపించడం లేదు. ఎవరూ ముందుకు రావడం లేదు. చేతులు కలపడమూ లేదు. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని.. పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఏడాది పాలన తర్వాత.. సంబరాలు చేయాలని అన్నారు. అయితే.. ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లి గూడెంలో ఎమ్మెల్యే సింగిల్‌గా మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి టీడీపీ నుంచి ఎవరినీ పిలవలేదని ప్రచారం జరుగుతోంది.
ఇక, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ.. టీడీపీ నాయకులు ఒంటరిగా పనికానిచ్చారు. ఇక్కడ జనసేన నుంచి పెద్దగా ఎవరికీ ఆహ్వానాలు అందలేదు. ఈ పరిణామాలను గమనిసిస్తే.. ఏడాది తర్వాత కూడా పరి స్థితిలో ఏమాత్రం మార్పులేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. అంతేకాదు.. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవాలని పార్టీ నాయకులు చెబుతున్నా.. అది చెప్పడం వరకే పరిమితం అవుతోంది. సీమ విషయానికి వస్తే.. ఇక్కడకూడా దాదాపు అంతే.. అనాల్సి వస్తోంది.
ఇది అంతర్గతంగా కార్యకర్తలపై ప్రభావం చూపుతోంది. నాయకులను బట్టే కార్యకర్తలు పనిచేస్తారు. నాయకులు ఎలా ఉంటే కార్యకర్తలు కూడా అలానే ఉంటారు. దీనిలో తేడా లేదు. సో.. ప్రస్తుతం కూటమి అంటే.. చంద్రబాబు+పవన్ కల్యాణ్ అన్నట్టే ఉంది తప్ప.. కార్యకర్తలు కలివిడిగా మాత్రం ఉండడంలేదు. ఎవరికి వారుగానే ఉంటున్నారు. ఏ విషయాన్నయినా.. నాయకులు సీరియస్‌గా తీసుకోవడం లేదన్నది కూడా గమనార్హం. సో.. ఎలా చూసుకున్నా.. కూటమి బాగానే ఉంది. కానీ, అంతర్గతంగానే వివాదాలు ముదురుతున్నాయి.