Begin typing your search above and press return to search.

బీజేపీ కోటా లేనట్లే...జనసేనకు లక్కీ చాన్స్ !

ఏపీలో టీడీపీ కూటమి తాజాగా సమావేశం అయి రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్య సభ సీట్లను ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలన్నది సమీక్షించింది.

By:  Satya P   |   5 Jun 2026 10:00 AM IST
బీజేపీ కోటా లేనట్లే...జనసేనకు లక్కీ చాన్స్ !
X

ఏపీలో టీడీపీ కూటమి తాజాగా సమావేశం అయి రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్య సభ సీట్లను ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలన్నది సమీక్షించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఏపీ నుంచి ఖాళీ అయ్యే నాలుగింటిలో మూడు తెలుగుదేశం పార్టీ ఒకటి జనసేన పంచుకోవడానికి నిర్ణయించారు అని తెలుస్తోంది. బీజేపీకి ఈ దఫా చాన్స్ లేనట్లే అని చెబుతున్నారు.

బీజేపీ వాటా పూర్తి :

ఇక ఏపీలో ఏ పదవులు అయినా దామాషా పద్ధతిలో పంచుకుంటున్నారు. కూటమిలో పెద్దన్న అయిన టీడీపీ సింహ భాగం తీసుకుంటే తరువాత ప్లేస్ లో జనసేన ఉంటోంది. బీజేపీకి మూడవ అవకాశం దక్కుతోంది. అయితే రాజ్యసభ సీట్ల విషయం తీసుకుంటే 2024 నుంచి 2029 మధ్యలో పన్నెండు దాకా ఖాళీ అయితే అందులో బీజేపీ వాటాగా ఇప్పటికే రెండు సీట్లు ఇచ్చేశారు. ఆ విధంగా ఆర్ క్రిష్ణయ్య, గోదావరి జిల్లాల నుంచి ఒక నేత ఎన్నికయ్యారు. ఇదే సమయంలో టీడీపీ గతంలో రెండు తీసుకుంది. ఇపుడు మూడు తీసుకుంటోంది. ఇప్పటిదాకా ఒక్క చాన్స్ కూడా దక్కని జనసేనకు తొలిసారి ఒక సీటు ఇస్తున్నారు. రానున్న కాలంలో ఇదే ఫార్ములా ప్రకారం సీట్లను కేటాయిస్తారు అని అంటున్నారు. ఈ లెక్కన జనసేనకు రాజ్యసభ సీట్లు వస్తాయని బీజేపీ వాటా కోటా పూర్తి అయినట్లే అని అంటున్నారు.

జనసేనకు మరో రెండు సీట్లు :

మొత్తంగా 2029 ఎన్నికల ముందు దాకా జరిగే రాజ్య సభ ఎన్నికల్లో లభించే సీట్లలో మరో రెండు జనసేనకు దక్కుతాయని అంటున్నారు. ఆ మిగిలిన సీట్లు టీడీపీకి వస్తాయని అంటున్నారు. అంటే ఈ టెర్మ్ లో బీజేపీకి రాజ్యసభ సీట్లు ఏపీ నుంచి దక్కేది ఉండదని తెలుస్తోంది. 2028లో చూస్తే మరో నాలుగు సీట్లు ఖాళీ అవుతాయని అంటున్నారు. ఆ సీట్ల విషయంలోనూ జనసేన టీడీపీలకే షేరింగ్ ఉంటుందని అంటున్నారు.

ఆశావహులు డీలా :

ఇక ఏపీ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభ కోటాలో పెద్దల సభకు వెళ్లాలని అనుకుంటున్న వారికి నిరాశ కలిగినట్లే అంటున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రి ఒకరితో పాటు కీలక నేతలు ఉన్నారని చెబుతున్నారు. ఇక తమిళనాడు నుంచి అన్నామలైకి ఏపీ కోటాలో సీటు దక్కుతుందని ప్రచారం సాగినా అది కూడా ఉత్తిదే అని తేలిపోయింది. బీజేపీ సైతం ఏపీ విషయంలో పెద్దగా ఒత్తిడి చేయదలచుకోలేదని అంటున్నారు. దాంతో టీడీపీ నుంచి ఈసారి ముగ్గురు రాజ్యసభకు నామినేట్ అవుతారని అంటున్నారు జనసేన అభ్యర్థి ఎవరో తేలాల్సి ఉంది. ఈ నెల 8న రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు పూర్తి అవుతుంది. ఏపీ నుంచి నలుగురు మాత్రమే పోటీ పడితే వారంతా ఏకగ్రీవంగా నెగ్గినట్లుగా ఈ నెల 11న ప్రకటిస్తారు.