Begin typing your search above and press return to search.

ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !

స్థానిక ఎన్నికల్లో 94 శాతానికి పైగా విజయాలు సాధించామని చెబుతున్న కూటమి పార్టీలు.. ఇదే సమన్వయాన్ని కొనసాగించాలని భావిస్తున్నాయి. పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి.

By:  Garuda Media   |   5 Nov 2026 11:57 AM IST
ఇక.. 100 ప‌ర్సంట్ దూకుడే.. !
X

కూట‌మి పార్టీల దూకుడు మ‌రింత పెరుగుతుందా? వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లే ల‌క్ష్యంగా పార్టీలు మ‌రింత స‌మ‌న్వ యంతో ముందుకు సాగుతాయా? త‌దుప‌రి ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా నిర్ణ‌యాలు ఉంటాయా? అంటే.. ఔన‌నే స‌మాధానమే వినిపిస్తోంది. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు సంయుక్తంగా 2024లో విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. రెండున్న రేళ్ల స‌మ‌యంలో వ‌చ్చిన స్థానిక ఎన్నిక‌ల్లోనూ దాదాపు అంత‌కు మించి అన్న త‌ర‌హాలో విజ‌యాన్ని కైవ‌సం చేసుకు న్నాయి. తాజాగా జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో 94 శాతాన్ని మించిన గెలుపును పార్టీలు ఆశ్వాదిస్తున్నాయి.

ఇప్పుడు ప‌రిష‌త్ ఎన్నిక‌లు త‌ర్వాత గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హాలో విజ‌యం ద‌క్కించుకునేందుకు కూట‌మి ప‌క్షాలు మ‌రోసారి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంచేస్తున్నాయి. ఇదే విష‌యాన్ని తాజాగా టీడీపీ అధినేత చంద్ర బాబు తేల్చి చెప్పారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ కూట‌మిదే పైచేయి కావాల‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. దీని త‌ర్వాత‌.. వెంట‌నే గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు రానున్నాయి. ఇవి పార్టీ జెండాల‌కు అతీతంగా జ‌రిగిన‌ప్ప‌టికీ.. పంచాయ‌తీల్లోనూ ప్ర‌భంజ‌నం కొన‌సాగేలా కూట‌మి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది.

మొత్తంగా చూస్తే.. ప్ర‌స్తుతం స్థానిక ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యం మాత్రం కూట‌మికి ఎన‌లేని ఉత్సాహాన్ని.. పెంచే సింది. దీనిని వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అంటే.. 2029 ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా కాపాడుకునే దిశ‌గానే అడుగులు వేయాల న్న‌ది చంద్ర‌బాబు చెబుతున్న మాట‌. ఈయ‌న మాత్ర‌మే కాదు.. జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం.. ఇదే మాట చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇదే స్ఫూర్తి క‌నిపించాల‌ని ఇటు ప్ర‌జ‌ల‌కు, అటు నాయ‌కుల‌కు కూడా ప‌వ‌న్ సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల‌న్న‌దే వారి ల‌క్ష్యంగా ఉంది.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుని కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌న్న‌ది ప్ర‌స్తుతం ముందున్న ల‌క్ష్యం. దీనిని సాధించేందుకు ఇప్పుడున్న స్ఫూర్తినే కొన‌సాగిస్తే బెట‌ర్ అన్న భావ‌న కూడా ఉంది. సో.. మొత్తంగా 100 శాతం స్ట్ర‌యిక్ రేట్ కొన‌సాగిస్తూ.. వ‌చ్చే అసెంబ్లీ పోరులోనూ వైసీపీని నామ‌రూపాలు లేకుండా చేయాల‌న్న వ్యూహాత్మ‌క ఆలోచ‌న‌ను ఇప్ప‌టి నుంచే కార్యాచ‌ర‌ణ‌లోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి కూడా త్వ‌ర‌లోనే నిర్ణ‌యాలు ఉంటాయ‌ని.. బ‌ల‌మైన పోటీ ఇవ్వ‌డంతోపాటు.. వైసీపీ ఉనికిని కూడా లేకుండా చేయాల‌న్న‌ది కూట‌మి ల‌క్ష్యం.