ఎమ్మెల్యేలపై కోపం.. ఎన్నికలపై చూపిస్తున్నారా.. ?
రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు స్థానిక నాయకులకు మధ్య కొన్ని నియోజకవర్గాల్లో వైరం కొనసాగుతోంది.
By: Garuda Media | 28 Oct 2026 7:00 AM ISTరాష్ట్రంలో ఎమ్మెల్యేలకు స్థానిక నాయకులకు మధ్య కొన్ని నియోజకవర్గాల్లో వైరం కొనసాగుతోంది. తమకు ఏమా త్రం సహకరించడం లేదని ఎమ్మెల్యేలు, అసలు తమకు ఏ పనులు చేయడం లేదని నాయకులు ఒకరిపై ఒకరు అక్కసుతో ఉన్నారు. ఇలాంటి నియోజకవర్గాల్లో స్థానిక ఎన్నికల వ్యవహారం.. చర్చనీయాంశంగా మారింది. మరో రెండు రోజుల్లోనే ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడనుంది. నవంబరు 1న ఎన్నికలు జరగనున్నాయి. మునిసిపల్, కార్పొరేషన్ల పరిధిలో నవంబరు 1న జరిగే ఎన్నికలు ఎమ్మెల్యేల ప్రభావాన్ని స్పష్టం చేస్తుందని అంటున్నారు.
ఏం జరుగుతోంది.. ?
స్థానికంగా ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్న టీడీపీ నేతలు కొందరు.. వారికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే వర్గం తరఫున ఎన్నికల్లో నిలిచిన వారికి పూర్తిస్థాయి సహాయ నిరాకరణ ప్రకటించిన ట్టు తెలుస్తోంది. అయితే.. దీనిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఉదాహరణకు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిల ప్రియతో విభేదిస్తున్న ఓ వర్గం.. ఆమె బ్యాచ్‌గా ఉన్న కొందరు నేతలకు ఏమాత్రం సహకరించడం లేదు. అలానే.. కూటమి తరఫున బరిలో నిలిచిన వారికి కూడా సహాయ నిరాకరణ చేస్తున్నారు.
పలు చోట్ల మేయర్ స్థానాలను టీడీపీ నేతలు.. వారి వారసులు ఆశించారు. కానీ, పొత్తులో భాగంగా అవి జనసేనకు, బీజేపీకి కూడా వెళ్లాయి. మరికొన్ని చోట్ల ఆశించిన నాయకులకు అవకాశం చిక్కలేదు. ఇలాంటి చోట్ల కూడా ఎమ్మె ల్యే వర్గాలు.. మౌనంగా ఉంటున్నాయి. దీనిపై పార్టీ తరఫున ప్రత్యేకంగా సూచనలు, సలహాలు వచ్చినా.. బుజ్జగిం పు రాజకీయాలు చేస్తున్నా.. నాయకులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిణామాలతో అధిష్టానం కొంత మేరకు.. ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఏం చేయాలి.. ?
ప్రస్తుతం విజయవాడ, విజయనగరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వంటి కీలకనగరాల్లో చోటు చేసుకున్న ఈ అసంతృప్తులు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం వంటి పరిణామాలు ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంద న్న అంచనాలువ స్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. అందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఇదేసమయంలో నామినేటెడ్ పదవులను కూడా ప్రకటిం చే అవకాశం ఉంది. తద్వారా అంతర్గత సెగను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
