'శబరి' సెంట్రిక్‌గా ఎందుకీ రాజకీయం?!
అనంతరం ఎంపీ టికెట్ ఇచ్చారు. అయితే.. ఇలా బీజేపీలో ఉన్న నాయకురాలికి హుటాహుటిన కండువా కప్పడాన్ని మెజారిటీ తమ్ముళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు.
By: Tupaki Desk | 6 July 2025 4:00 AM ISTఏపీలోని కొన్ని జిల్లాల్లో టీడీపీ నాయకుల రాజకీయం ఏమాత్రం మారడం లేదు. పైకి అంతా బాగున్నట్టుగా .. పార్టీ అధినేత చంద్రబాబు ముందు కలరింగ్ ఇస్తున్నారు. కానీ, తెరచాటున మాత్రం వివాదాలు.. విభేదా లతో నాయకులు కత్తులు దూసుకుంటున్నారు. దీంతో పార్టీ పరిస్థితి ఇబ్బందిగానే కాకుండా.. రాజకీయ రచ్చగా కూడా తెరమీదికి వస్తోంది. తాజాగా వెలుగు చూసిన నంద్యాల జిల్లా మాత్రమే కాదు.. ఇతర జిల్లా ల్లోనూ సొంత పార్టీ నాయకులే తన్నుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత నిర్దేశించిన.. `సుపరిపాలనలో తొలి అడుగు` కార్యక్రమంలోనే నాయకులు వివాదాలకు దిగడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. నంద్యాల జిల్లాలో ఎంపీ శబరిని వ్యతిరేకించే వర్గం ఎక్కువ గానే ఉంది. ఎందుకంటే.. గత ఏడాది ఎన్నికలకు ముందు వరకు కూడా ఆమె బీజేపీలోనే ఉన్నారు. ఆమె ను అలానే ఉంచి.. టికెట్ ఇస్తే సరిపోయేది. కానీ, ఆమెను నామినేషన్ల గడువుకు రెండు రోజుల ముందు.. పార్టీ ఆఫీసుకు పిలిచి కండువా కప్పారు.
అనంతరం ఎంపీ టికెట్ ఇచ్చారు. అయితే.. ఇలా బీజేపీలో ఉన్న నాయకురాలికి హుటాహుటిన కండువా కప్పడాన్ని మెజారిటీ తమ్ముళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే వారంతా ఒక జట్టుగా ఉండగా .. వీరిని విభేదించే ఏరాసు ప్రతాప్ రెడ్డి వంటి నాయకులు శబరి వర్గంగా ఉన్నారు. ఇదే వివాదానికి కారణ మైంది. ఇప్పుడే కాదు.. గత ఏడాది కూడా.. శబరి పాల్గొనే కార్యక్రమాలను బాయ్ కాట్ చేశారు. ఒక్క శ్రీశైలం నియోజకవర్గంలోనే కాదు.. నంద్యాల పార్లమెంటు పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాల్లో ఒకటి రెండు మినహా.. అన్ని చోట్లా శబరి సెంట్రిక్‌గా రాజకీయాలు సాగుతున్నాయి.
మరోవైపు.. ఎంపీ శబరి దూకుడు కూడా.. పార్టీలో చర్చ నీయాంశంగానే ఉంది. అన్నీ తానే చేశానని.. స్థానిక నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఆమె పరోక్షంగా తన వర్గంతో ప్రచారం చేయిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చినప్పుడు కూడా.. ఆమె మాట్లాడి ముగిస్తున్నారు తప్ప.. ఇతర నాయకులకు అవకాశం ఇవ్వడం లేదు. ఇది కూడా టీడీపీలో విభేదాలకు దారితీస్తోంది. అంటే ఒక రకంగా ఆధిపత్య రాజకీయాలకు శబరి సెంట్రిక్‌గా మారుతున్నారన్న చర్చ కూడా ఉంది.