Begin typing your search above and press return to search.

జగన్ వైసీపీ గురించి ...టీడీపీ కొత్త స్ట్రాటజీ !

ఈ నేపధ్యంలోనే వైసీపీ మీద టీడీపీ సరికొత్త అస్త్రం సిద్ధం చేసింది. ఆ పార్టీ పేరుని అయితే చాలా కాలంగా అసలు పలకడమే మానేసింది.

By:  Satya P   |   30 May 2026 7:00 AM IST
జగన్ వైసీపీ గురించి ...టీడీపీ కొత్త స్ట్రాటజీ !
X

ఏపీలో టీడీపీ కూటమిని నడిపిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతోంది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి 2024 జీవన్మరణ సమస్య అయితే 2029 ఎన్నికలు మరింత కీలకమైన ఇష్యూగా మారాయని అంటున్నారు. ఈ ఎన్నికలలో మళ్లీ గెలవాలని టీడీపీ చూస్తోంది. అది కూడా కూటమితోనే అని అంటోంది. ఈ విషయంలో మిత్రులు అయిన జనసేన బీజేపీల నుంచి కూడా రెండో మాట లేదు. పవన్ అయితే ఏకంగా పదిహేనేళ్ల పాటు కూటమి కొనసాగాలని బలంగా కోరుకున్నారు. బీజేపీకి కూడా ఏపీలో తమకు అధికార భాగస్వామ్యం సీట్లూ దక్కుతూంటే పొత్తుకు సై అనే అంటుంది అని చెబుతున్నారు.

వైసీపీని అలా చేశారు :

ఈ నేపధ్యంలోనే వైసీపీ మీద టీడీపీ సరికొత్త అస్త్రం సిద్ధం చేసింది. ఆ పార్టీ పేరుని అయితే చాలా కాలంగా అసలు పలకడమే మానేసింది. అంతే కాదు జగన్ పేరు కూడా తలవడం మానేసింది. అయినా సరే వైసీపీ మీద జగన్ మీద తీవ్ర స్థాయిలో టీడీపీ విమర్శలు చేస్తోంది. అవన్నీ జగన్ కి వైసీపీకి చెందినవే అని ఎస్టాబ్లిష్ చేసి జనాలు అర్థం చేసుకునేలా చేయడంలో టీడీపీ పూర్తి సక్సెస్ అయిపోయింది. అందుకే గొడ్డలి పార్టీ అని గత కొద్ది నెలలుగా టీడీపీ ఒక పెద్ద ప్రచారమే మొదలెట్టింది. ఆ ప్రచారాన్ని వైసీపీ అడ్డుకోలేకపోయింది. అంతే కాదు కౌంటర్ స్ట్రాటజీ కూడా రూపొందించలేకపోయింది అంతే కాదు ఇది టీడీపీ పక్కా వ్యూహం అని కూడా వైసీపీ పెద్దలు ఈ రోజుకీ గ్రహించలేకపోవడమే ఫ్యాన్ పార్టీలో ఉన్న ప్రధాన లోపం అని అంటున్నారు. ఈ రోజుకీ టీడీపీ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అలా జగన్ ని విమర్శిస్తోంది అని వైసీపీ నేతలు జగన్ సహా అంటున్నారు కానీ దాని వెనక పవర్ ఫుల్ వ్యూహం ఉందని మాత్రం గ్రహించలేకపోతున్నారు అని అంటున్నారు.

గొడ్డలి అంటే అన్నీ :

ఇక వైసీపీ విషయంలో గొడ్డలి పార్టీ అంటూ ప్రచారం గట్టిగా చేయడం ద్వారా ఆ పార్టీ అంటే అరాచకం విద్వంశం అని ప్రాజెక్ట్ చేయడంలో టీడీపీ విజయం సాధించింది. సాధారణంగా జనాలు శాంతి భద్రతలను కోరుకుంటారు. అలాంటిది అరాచకాలు అక్రమాలు అకృత్యాలు అని ప్రచారం చేస్తే న్యూట్రల్ జనాలే కాదు విద్యావంతులు యువత అంతా కూడా పూర్తిగా దూరం అవుతారు ఇపుడు ఆ రకమైన స్ట్రాటజీనే టీడీపీ వైసీపీ మీద ప్రయోగిస్తోంది. వైసీపీ అంటే రక్తపాతం అని హత్యా రాజకీయాలు అని నేరస్థుల పార్టీ అని ప్రచారం చేయడంలో టీడీపీ ముందుంటే దానిని డిఫెన్స్ చేసుకోవడంలో వైసీపీ విఫలం అయింది అని అంటున్నారు.

జగన్ పేరుకు బదులుగా :

ఇక వైసీపీ అధినేత జగన్ పేరుని కూడా టీడీపీ నాయకులు అంతా పలకడం మానేసి చాలా కాలం అయింది జగన్ పేరుకు బదులుగా గొడ్డలి పార్టీ నాయకుడు అని కొత్త పేరు పెట్టేసారు ఆ పేరు చెబితే చాలు అది జగనే అని జనాలకు కనెక్ట్ అయ్యేంతలా ఈ ప్రచారం పీక్స్ లో సాగుతోంది. మహానాడులో కూడా గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు చేస్తూ వచ్చారు. వైసీపీ మాత్రం ఈ విషయంలో ఇంకా వెనకబడే ఉందని కౌంటర్ పాలిటిక్స్ స్టార్ట్ చేయకపోతే మాత్రం ఏ ఫర్ యాపిల్ అన్నట్లుగా గొడ్డలి అంటే వైసీపీ అని జనాలు నూరు శాతం ఫిక్స్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.