టీడీపీలో వారి ఎంట్రీకి బ్రేకు...ఫ్యూచర్ కి చెక్
తెలుగుదేశం పార్టీ తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం వల్ల చాలా మంది రాజకీయ నాయకుల భవిష్యత్తు ఏమిటి అన్నది చర్చనీయాంశంగా ఉంది.
By: Tupaki Desk | 9 Jun 2025 5:30 AMతెలుగుదేశం పార్టీ తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం వల్ల చాలా మంది రాజకీయ నాయకుల భవిష్యత్తు ఏమిటి అన్నది చర్చనీయాంశంగా ఉంది. వైసీపీని వీడి టీడీపీ వైపు చూస్తున్న వారిలో అనేక మంది కీలక నేతలు మాజీ మంత్రులు ఉన్నారు. వారంతా ఏదో రోజున పిలుపు రాకపోతుందా చేరకపోదామా అని ఎదురుచూస్తున్న వారే.
అయితే సడెన్ గా మహానాడులో చంద్రబాబు కోవర్టులుగా కొందరు పార్టీలోకి వస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు వలస పక్షులు వస్తూంటాయి పోతూంటాయని కూడా మరో హాట్ కామెంట్ చేశారు. ఆ తరువాత టీడీపీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇతర పార్టీల నుంచి వచ్చి టీడీపీలో చేరే వారి విషయంలో ఒకటికి పదిసార్లు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తామని స్పష్టం చేసింది.
అంతే కాదు జిల్లా కమిటీలు అన్నీ కూడా కేంద్ర నాయకత్వానికి పార్టీలో చేరే వారి వివరాలు ఇవ్వాలని కోరింది. దాంతో పాటు ఇక చేరికల మీద టీడీపీ అధినాయకత్వం పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదు అని అంటున్నారు ఇప్పటికే టీడీపీ హౌస్ ఫుల్ గా ఉండడంతో పాటు ఇటీవల మహానాడులో తీసుకున్న ఆరు శాసనాలలో ప్రధానమైనదిగా ఉన్న కార్యకర్తే అధినేత అన్న దానికి కట్టుబడాలని చూస్తోంది.
క్యాడర్ ఫస్ట్ అన్న స్లోగన్ ఇపుడు టీడీపీలో ఉంది. సహజంగా క్యాడర్ ఎపుడూ వలస పక్షులను కోరుకోదు. పార్టీలో ఉన్న వారికే పదోన్నతి కావాలని అడుగుతుంది. పనిచేసే క్యాడర్ కి న్యాయం చేయాలని కూడా కోరుతుంది. దాంతో టీడీపీ వచ్చి చేరాలనుకున్న నాయకులు ఎంతో మంది ఉన్నా వద్దు అనే అనుకుంటోంది. అందుకే కీలక ప్రకటనతో తన నిర్ణయాన్ని అలా తెలియచేసింది అని అంటున్నారు.
అయితే టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా మంది ఫ్యూచర్ ఏమిటి అన్నది అర్ధం కాకుండా ఉందని అంటున్నారు. మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. ఆయన చేరికకు పార్టీకి లోకల్ గానే ఇబ్బందులు ఉన్నాయ్ అని అంటున్నారు. అయితే ఇపుడు పార్టీ కీలక నిర్ణయంతో ఆయన చేరికకు బ్రేకులు పడినట్లేనా అన్న చర్చ ఉంది.
ఆయనే కాదు ఉత్తరాంధ్రాలో కొందరు కీలక నేతలు మాజీ మంత్రులు టీడీపీ వైపు చూస్తున్నారని చాలా కాలంగా ప్రచారం ఉంది. అయితే ఇపుడు వారు తమ భవిష్యత్తుని వేరే విధంగా ఆలోచించుకోవాల్సిందే అని అంటున్నారు. అలాగే గోదావరి జిల్లాలలో కొందరు నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు.
వారి విషయంలో కూడా ఈ విధాన ప్రకటన ఆశాభంగంగా మారిందని అంటున్నారు. దాంతో ఇంతకాలం వైసీపీలో సైలెంట్ గా ఉన్న వారు బయటకు వచ్చి మరీ తాము పార్టీలోనే ఉన్నామని పుకార్లు నమ్మవద్దని చెప్పే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. అదే విధంగా ఇంకొంతమంది నేతలు ముహూర్తాలు కూడా పెట్టుకున్నారని ఇపుడు వారు పునరాలోచనలో పడిపోయారు అని అంటున్నారు. ఇదే అదనుగా వైసీపీ కొందరి పైన వేటు వేస్తోంది.
ఆ విధంగా వారు తమకు కూడా వద్దు అని చెబుతోంది. మొత్తానికి వైసీపీలో ఉండలేక టీడీపీలో డోర్లు క్లోజ్ అయిన నేతలకు రాజకీయం పూర్తిగా అయోమయంలో పడింది అని అంటున్నారు. చూడాలి మరి టీడీపీ తలుపులు ఎపుడు ఎలా ఎవరి కోసం తెరచుకుంటాయో.