Begin typing your search above and press return to search.

'ఇంటి గుట్టు' విష‌యంలో టీడీపీనే బెట‌రంట‌..!

ముఖ్యంగా ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధాలు ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఇది ఇబ్బందిక‌రంగా మారుతోంది.

By:  Garuda Media   |   26 July 2026 3:00 PM IST
ఇంటి గుట్టు విష‌యంలో టీడీపీనే బెట‌రంట‌..!
X

ఇంటి గుట్టు.. బ‌య‌టకు వ‌స్తే.. ఎంత‌టి వారికైనా ప్ర‌మాద‌మే. అది వ్య‌క్తిగ‌త‌మైనా.. రాజ‌కీయాలైనా అంతే. ఈ విష‌యంలో టీడీపీలో ఉన్న క‌ట్టుబాటు.. ఇత‌ర పార్టీల్లో కొంత మేర‌కు త‌క్కువ‌గానే ఉంద‌న్న‌ది వాస్త వం. టీడీపీలో ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. అది అధినేత నోటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే వ‌ర‌కు నాయ‌కులు బ‌హిరంగ ప‌ర‌చ‌డం లేదు. అంతేకాదు.. దీనిపై డిస్క‌ష‌న్స్ కూడా ఉండ‌వు. ఎక్క‌డా నోరు జారుతున్న నాయ‌కులు కూడా టీడీపీలో క‌నిపించ‌రు.

ఫ‌లితంగా అధినేత తీసుకునే నిర్ణ‌యాలు.. ఆయ‌న నోటి నుంచే బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఎక్క‌డైనా ఒక రిద్ద‌రు బ‌య‌ట‌కు చెప్పేసే అలవాటు ఉన్న నాయ‌కులు క‌నిపిస్తే.. వారిని త‌మ‌దైన శైలిలోనే నియంత్రిస్తు న్నారు. కీల‌క స‌మావేశాల‌కు కూడా పిల‌వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. పార్టీ ప‌రంగా అవ‌లంభించే వ్యూహాలు.. వేసే ఎత్తుగ‌డ‌లు వంటివి పెద్ద ఎత్తున వ‌ర్క‌వుట్ అవ్వాలంటే.. ముందుగానే రిలీవ్ అయితే ఇబ్బంది అన్న విష‌యాన్ని త‌మ్ముళ్లు గ్ర‌హించారు.

ముఖ్యంగా ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధాలు ఇవ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఇది ఇబ్బందిక‌రంగా మారుతోంది. గ‌త ప్ర‌భుత్వంలో చేసిన త‌ప్పుల‌ను కొంద‌రు ఇంకా మ‌రిచిపో లేక పోతున్నారు. వాస్త‌వానికి టీడీపీ ఈ విష‌యాల‌ను గుర్తు చేస్తూనే ఉంది. కానీ, దీనికి తోడు వైసీపీ నుంచి కూడా అదే త‌ర‌హాలో మాట‌ల తూటాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మ‌నం త‌ప్పు చేశాం.. అంటూ.. కొంద‌రు నాయ‌కులు మ‌న‌సులో ఉన్న మాట‌ను దాచుకోలేక పోతున్నారు.

ఉత్త‌రాంధ్ర నుంచి క‌ర్నూలు వ‌రకు కొంద‌రు నాయ‌కులు సొంత పార్టీ త‌ప్పుల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. అంతే కాదు.. మ‌న‌క‌న్నా.. టీడీపీనే ప‌నిచేస్తోంద‌ని బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వాస్త‌వానికి ఇలాంటి అభిప్రా యాలు ఉండ‌డం త‌ప్పుకాదు. అయితే.. వీటిని అంత‌ర్గ‌త వేదిక‌ల‌పైనే నాయ‌కులు చ‌ర్చించాలి. దీనికి భిన్నంగా నాయ‌కులు బ‌హిరంగ వేదిక‌ల‌పైనే ఇలాంటి కామెంట్స్ చేస్తుండ‌డంతో వైసీపీకి తీర‌ని ఇబ్బంది వ‌స్తోంద‌ని పార్టీలోని మ‌రికొంద‌రు నాయ‌కులు చెబుతున్నారు.

ఎందుకిలా..?

నాయ‌కులు ఇలా రోడ్డున ప‌డిపార్టీ గురించి మాట్లాడ‌డానికి కీల‌క‌మైన రెండు కార‌ణాలు ఉన్నాయి.

1) ఇతర నేత‌లు చెప్పిన విష‌యాల‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోక‌పోవ‌డం. ఫ‌లితంగా వారు ఎలానూ త‌మ‌కు చెప్పే అవ కాశం లేద‌ని భావిస్తున్న నేప‌థ్యంలో మ‌న‌సులో మాట‌ను బ‌హిరంగ వేదిక‌ల‌పైనే చెబుతున్నారు. .అంతేకా దు.. పార్టీ అధినేత‌పై ఉన్న అక్క‌సు కూడా దీనికి కార‌ణం.

2) త‌మ‌కు చెప్పే అవ‌కాశం లేక‌పోవ‌డం. పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌లకు జ‌గ‌న్ అస‌లు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేదు. దీంతో నాయ‌కుల‌కు త‌మ అభిప్రాయాల‌ను పంచుకునే వెసులుబాటు లేకుండా పోయింది. ఇదికూడా ఇంటి గుట్టును బ‌య‌ట ప‌డేసేలా చేస్తోంద‌న్న వాద‌న వ‌చ్చేలా చేసింది.