Begin typing your search above and press return to search.

టీడీపీ... ఆర్నాబ్ తో పాచప్!

గత మూడు రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంటి అంటే టీడీపీ వర్సెస్ అర్నాబ్. జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ చానల్ లో ఉన్న ఆర్నాబ్ ఇండిగో విమాన సంక్షోభం వేళ టీడీపీని ఫుల్ గా ఫోకస్ చేసి మరీ గట్టిగానే కామెంట్స్ చేశారు.

By:  Satya P   |   11 Dec 2025 9:00 PM IST
టీడీపీ...  ఆర్నాబ్ తో పాచప్!
X

గత మూడు రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంటి అంటే టీడీపీ వర్సెస్ అర్నాబ్. జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ చానల్ లో ఉన్న ఆర్నాబ్ ఇండిగో విమాన సంక్షోభం వేళ టీడీపీని ఫుల్ గా ఫోకస్ చేసి మరీ గట్టిగానే కామెంట్స్ చేశారు. ఇక టీడీపీ విషయానికి వస్తే లోకేష్ ని పైకి లేపాలి అని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేసింది.కాస్తా రివర్స్ అయింది అని అంటున్నారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అతి వ్యవహారంతో జాతీయ స్థాయిలోనే టీడీపీ వర్సెస్ ఆర్నాబ్ వ్యవహారం తెగ వైరల్ అయిపోయింది. దాంతో లాక్కో లేక పీక్కో లేక అన్నట్లుగా జాతీయ స్థాయిలో టీడీపీకి మీడియా వ్యవహారం ఉందని అంటున్నారు.

ఆర్నాబ్ ప్లాన్ లో పడి :

నిజానికి చూస్తే కేంద్ర మంత్రిగా యువ నేతగా రామ్మోహన్ నాయుడు కు క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ ఆర్నాబ్ బీజేపీని కాపాడే ప్రయత్నం చేశారని అంటున్నారు. అందుకే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ ని గట్టిగానే టార్గెట్ చేశారు అని చెబుతున్నారు. అయితే ఈ విషయం గ్రహించిందో లేదో తెలియదు కానీ ఓవర్ చేసి టీడీపీ ఈ ఇష్యూలో అడ్డంగా బుక్ అయిపోయింది అని అంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే అనవసరంగా తలదూర్చి బలి అయింది అని కూడా అంటున్నారు. నిజానికి చూస్తే ఈ ఎపిసోడ్ లో లోకేష్ ప్రస్తావనే అనవసరంగా తెచ్చారు అని అంటున్నారు. ఆయన ఇక్కడ ఎక్కడా లేరు, అమెరికా పర్యటనలో ఉన్నారు. కానీ టీడీపీ తమ్ముళ్ల అతి ఉత్సాహం వల్లనే తప్పు లేకపోయినా చంద్రబాబు లోకేష్ కూడా ఈ వ్యవహారంలో ఇబ్బంది పడాల్సి వచ్చింది అని అంటున్నారు. ఇదంతా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చేసిన తప్పు అని అంటున్నారు. దాని వల్లనే లోకేష్ ఇమేజ్ సైతం ఇబ్బందిలో పడింది అని అంటున్నారు.

డ్యామేజ్ కంట్రోల్ కోసం :

ఇదిలా ఉంటే టీడీపీ వర్సెస్ ఆర్నాబ్ ఎపిసోడ్ లో అతి చేసిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డికి లోకేష్ క్లాస్ తీసుకున్నారు అని టాక్ అయితే నడుస్తోంది అంటున్నారు. అంతే కాదు లోకేష్ ఆదేశాల మేరకు డ్యామేజ్ కంట్రోల్ కోసం టీడీపీ చేయాల్సింది తెర వెనక చేసింది అని చెబుతున్నారు. టీడీపీ అనుకూలంగా ఉన్న మీడియా ప్రతినిధులు అంతా వెళ్లి ఈ విషయంలో ఆర్నాబ్ వ్యవహారంలో కొంత సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు అని టాక్ అయితే నడుస్తోందింట. ఇక అఫీషియల్ గా చూస్తే టీడీపీ సదరు ఆర్నాబ్ జాతీయ మీడియాను బాన్ చేయకున్నా టీడీపీ అనుకూల లోకల్ యూట్యూబ్స్ లో దాని మీదనే ప్రచారం చేశారు. అలా వాటి మీద వచ్చిన ప్రచారం చూసిన తరువాత ఆర్నాబ్ కి మరింతగా మండి ఏకంగా డిబేట్ పెట్టి ఉతికి ఆరేశారు అని అంటున్నారు.

లేని పోని తలనొప్పులు :

నిజం చెప్పాలీ అంటే చంద్రబాబు నాలుగవ సారి సీఎం అయ్యాక కీలక బాధ్యతలు అన్నీ లోకేష్ స్వీకరిస్తూ తనంతట తాను సొంతంగా ఎదుగుతున్నారు అని అంటున్నారు. ఈ సమయంలో కొందరి తమ్ముళ్ల అతి ఉత్సాహం వల్లన కొత్తగా తలనొప్పులు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో టీడీపీ హైకమాండ్ కూడా ఇదేమి తీరు అని కొందరు నేతల మీద ఫోకస్ పెడుతోంది అని అంటున్నారు. ఒక విధంగా జాతీయ స్థాయిలో టీడీపీ ఇబ్బంది పడేలా కొందరి తీరు ఉందని కూడా అంటున్నారుట.

ఆర్నాబ్ కూల్ అయ్యాడా :

మొత్తం మీద చూస్తే ఆర్నాబ్ అగ్గి మీద గుగ్గిలం కావడం జాతీయ స్థాయిలో ఈ ఇష్యూ ఒక రేంజిలో పాకిపోయింది. అయితే ఢిల్లీ స్థాయిలో ఉన టీడీపీ అనుకూల మీడియా మిత్రులు కొందరు ఆర్నాబ్ దగ్గరకు వెళ్ళి అసలు విషయం చెప్పారని అంటున్నారు. లోకేష్ తప్పు ఇందులో ఏమీ లేదని కూడా వివరించారుట. ఇక చంద్రబాబు 2023లో అరెస్ట్ అయితే తానే తొలిసారిగా లోకేష్ ని పిలిచి జాతీయ మీడియాలో చాన్స్ ఇచ్చాను అని ఆర్నాబ్ సదరు టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధుల వద్ద చెప్పారని టాక్ నడుస్తోంది. అపుడే కదా లోకేష్ టాలెంట్ అన్నది బయటపడింది అని చెబుతూ అంతవరకూ లోకేష్ ని సరిగ్గా అర్థం చేసుకోని వారు కూడా తరువాత తానేంటో తెలుసుకున్నారు కదా అని ఆర్నాబ్ అన్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో టీడీపీ లీడర్స్ కొందరి అతి ఉత్సాహమే తప్ప మరేమీ లేదని అనుకూల మీడియా సన్నిహితులు ఆర్నాబ్ కి నచ్చచెప్పడంతో ఆయన మొత్తానికి కూల్ అయ్యారని టాక్ అయితే నడుస్తోంది. మొత్తానికి చూస్తే ఇండిగో సంక్షోభం కాదు కానీ ఆర్నాబ్ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా గత కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో మీడియా సాగిన వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లే అని అంటున్నారు.