గుంటూరు, విజయవాడలపై కూటమి కసరత్తు ఏం చేస్తారు?
స్థానిక సంస్థల్లో వైసీపీ జెండా ఎగురుతోంది. కానీ, 2021లో జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం దక్కించుకుందని.. అప్పట్లో టీడీపీ నాయకులను కనీసం నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు.
By: Tupaki Desk | 18 April 2025 7:15 PM ISTస్థానిక సంస్థల్లో వైసీపీ జెండా ఎగురుతోంది. కానీ, 2021లో జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా విజయం దక్కించుకుందని.. అప్పట్లో టీడీపీ నాయకులను కనీసం నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాలకు టీడీపీ నాయకులు తెరదీశారు. వైసీపీకి చేసిన రాజకీయాలకు.. అంతే పదునుగా బుద్ధి చెప్పాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సాధ్యమైనన్ని స్థానిక సంస్థలను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇలా.. ఇప్పటి వరకు 13 స్థానిక సంస్థల్లో కూటమి పార్టీలు ఆధిపత్యం దక్కించుకున్నారు. అయితే.. ఇప్ప టి వరకు కార్పొరేషన్లలో పట్టు పెంచుకోలేక పోయారు. కీలకమైన విశాఖ, గుంటూరు, విజయవాడ కార్పొరేష న్లలో కూడా.. కూటమి జెండా ఎగరాలన్నది స్థానిక నాయకుల లక్ష్యం. ఈ క్రమంలోనే విశాఖపట్నం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గొలగాని వెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటించారు. దీనిపై శనివారం(ఏప్రిల్ 19) ఎన్నిక జరగనుంది.
ఇప్పుడు మరోవైపు.. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లపైనా కూటమి పార్టీల నాయకులు కసరత్తు చేస్తు న్నారు. ఈ రెండు రాజధాని అమరావతికి అత్యంత చేరువగా ఉండడంతోపాటు.. కీలకమైన ప్రభుత్వ పనులు చేసేందుకు కూడా.. ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో వైసీపీ ఆధిపత్యం కొనసాగు తుండడంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు అడ్డంకులు వస్తున్నాయని.. కూటమి నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాటిని కూడా తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
"విశాఖకార్పొరేషన్‌లో మా జెండా ఎగరడం ఖాయం. దీనికి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. వైసీపీ నాయకులు కోరి కోరి మా వైపు తిరుగుతున్నారు. మాకే మద్దతు ఉంది. ఇదిపూర్తయ్యాక.. విజయవా డ, గుంటూరుల విషయాన్ని పరిశీలిస్తాం" అని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మె ల్యే ఒకరు చెప్పారు. సో.. దీనిని బట్టి.. కూటమి పార్టీలు బలంగానే పనిచేస్తున్నాయని తెలుస్తోంది. ఇక, వైసీపీనాయకుల్లోనూ చాలా మంది అధికార పార్టీవైపు చూస్తున్నట్టు సమాచారం. ఇది వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
