Begin typing your search above and press return to search.

మ‌హానాడు కేరాఫ్‌ శ్రీకాకుళం.. రీజ‌నేంటి.. ?

ఈ ద‌ఫా 3-5 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు కార్య‌క‌ర్త‌లు వ‌స్తార‌న్న అంచ‌నాలువున్నాయి. దీంతో ఆ రేంజ్‌లోనే ఏర్పాట్ల‌ను కూడా ముమ్మ‌రం చేస్తున్నారు.

By:  Garuda Media   |   20 April 2026 3:17 PM IST
మ‌హానాడు కేరాఫ్‌ శ్రీకాకుళం.. రీజ‌నేంటి.. ?
X

టీడీపీకి అత్యంత కీల‌క‌మైన మ‌హానాడును ఈ ఏడాది ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళంలో నిర్వ‌హించాల‌ని నిర్ణయించారు. అయితే.. దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావల‌సి ఉంది. ఇక‌, శ్రీకాకుళంలో ఇప్ప‌టికే దీనిపై ఏర్పాట్లు కూడా ముమ్మ‌రం చేస్తున్నారు. ఈ ద‌ఫా 3-5 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు కార్య‌క‌ర్త‌లు వ‌స్తార‌న్న అంచ‌నాలువున్నాయి. దీంతో ఆ రేంజ్‌లోనే ఏర్పాట్ల‌ను కూడా ముమ్మ‌రం చేస్తున్నారు.

రీజ‌నేంటి..?

శ్రీకాకుళంలో మ‌హానాడును నిర్వ‌హించేందుకు మూడు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.

1) ఓట‌ర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెర‌గ‌డం: ఇత‌ర జిల్లాల‌ల‌తో పోల్చుకుంటే.. ఉత్త‌రాంధ్ర‌లో ఓట‌ర్ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా మ‌హిళా ఓట‌ర్ల సంక్య ఎక్కువ‌గా ఉంది. దీంతో ఇక్క‌డ మ‌రింత బ‌ల‌ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని పార్టీ అంచ‌నా వేసింది.

2) యువ‌త‌కు ప్రాధాన్యం: ఉత్త‌రాంధ్ర‌లో జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం.. యువ త ఎక్కువ సంఖ్య‌లో ఉన్నారు. వీరిని ఆక‌ర్షించేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ మ‌హానాడుకు సిద్ధ‌మైంది. అదేస మ‌యంలో ఏటా ప్రాంతాల‌ను కూడా మారుస్తున్న క్ర‌మంలో గ‌తంలో రాయ‌ల సీమ‌లో నిర్వ‌హించారు. ఈ ద‌ఫా ఉత్త‌రాంధ్ర‌కు ప్రాధాన్యం ఇచ్చారు. 2027లో మ‌ళ్లీ గుంటూరులోను, 2028లో సీమ‌లోనూ నిర్వ‌హించేలా ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం.

3) అభివృద్ది: అభివృద్ధి ప‌రంగా ఉత్త‌రాంధ్ర‌కు ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా ప్రాధాన్యం ద‌క్కింది. భోగాపురం విమానాశ్ర‌యంతోపాటు.. శ్రీకాకుళంలోని ఉద్దానంలో కిడ్నీ వైద్య శాలల ఏర్పాటు.. విశాఖ‌లో ఐటీ స‌హా.. డేటా కేంద్రాలు.. వంటివి విరివిగా వ‌స్తున్నాయి. ఈ అభివృద్ధిని చాటి చెప్పేందుకు కూడా మ‌హానాడును వేదిక‌గా చేసుకునేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ మూడు కారణాల‌తోనే శ్రీకాకుళంలో మ‌హానాడుకు ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.