Begin typing your search above and press return to search.

కమిటీలు వర్కవుటవుతాయా ?

తెలంగాణా బీజేపీ నేతలకు ఏం చేయాలో దిక్కుతోస్తున్నట్లు లేదు. అందుకనే షెడ్యూల్ ఎన్నికలు మరో రెండు నెలలుండగా ఇపుడు పార్టీకి సంబంధించిన 14 ఎన్నికల కమిటీలను వేశారు.

By:  Tupaki Desk   |   6 Oct 2023 4:17 AM GMT
కమిటీలు వర్కవుటవుతాయా ?
X

తెలంగాణా బీజేపీ నేతలకు ఏం చేయాలో దిక్కుతోస్తున్నట్లు లేదు. అందుకనే షెడ్యూల్ ఎన్నికలు మరో రెండు నెలలుండగా ఇపుడు పార్టీకి సంబంధించిన 14 ఎన్నికల కమిటీలను వేశారు. ఈ 14 కమిటీలకు ఛైర్మన్లు, కన్వీనర్లతో పాటు జాయింగ్ కన్వీనర్లను నియమించింది. ఇంత సడెన్ గా కమిటీలను పార్టీ ఎందుకు వేసిందంటే అసంతృప్తులను బుజ్జగించటానికే అని అర్ధమైపోతోంది. పార్టీ అగ్రనేతల వ్యవహారం ఎలాగుందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది.

పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు బహిరంగంగానే నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ సమస్య ఏమిటంటే పార్టీలో చేరటానికి ఇతర పార్టీల నుండి సీనియర్ నేతలు పెద్దగా ముందుకు రావడం లేదు. బయట పార్టీల నుండి బీజేపీలో చేరకపోగా పార్టీలో ఉన్న వాళ్ళే బయటకు వెళ్ళిపోవటానికి రెడీ అవుతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. కేంద్రమంత్రి, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యవహారశైలిపై చాలామంది సీనియర్లు మండిపోతున్నారు. నిజానికి కిషన్ వచ్చిందే కొత్తగా.

అయితే బండి సంజయ్ ని అధ్యక్షుడిగా నియమించటాన్ని జీర్ణించుకోలేకపోతున్న కొందరు సీనియర్లు ఆ కోపాన్ని కిషన్ పై చూపుతున్నారు. పార్టీ నాయకత్వంపై అనేక కారణాలతో అసంతృప్తిగా ఉన్న కొండా విశ్వేశ్వరరెడ్డి, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, విజయశాంతి, సోయం బాపూరావు, ఏనుగు రవీంద్రారెడ్డి, రమేష్ రాథోడ్ లాంటి వాళ్ళు తొందరలోనే పార్టీని వదిలేయబోతున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. మేనిఫెస్టో, పబ్లిసిటి కమిటీ ఛైర్మన్ వివేక్, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, పోరాటాల కమిటి ఛైర్ పర్సన్ గా విజయశాంతి, మేనిఫెస్టో కమిటీ మెంబర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీలో ఉండేది అనుమానమే.

అంటే ఇక్కడ సమస్య ఏమిటంటే పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరు చేరకపోగా అగ్రనేతలు తీసుకుంటన్న నిర్ణయాలతో పార్టీ గ్రాఫ్ పడిపోతోంది. ముఖ్యంగా బీజేపీ గ్రాఫ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయకపోవటంతోనే పడిపోయిందని కమలనాదులు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. దీనివల్ల బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని, నరేంద్రమోడీ-కేసీయార్ మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందనే ప్రచారాన్ని జనాలు నమ్ముతున్నారు. అందుకనే గ్రాప్ పడిపోతోంది. ఈ కారణంగానే చాలామంది అసంతృప్తితో ఉన్నారు.