Begin typing your search above and press return to search.

ఆ డీల్ పై టాటా గురి పెట్టిందా? వర్కువుట్ అయితే అదిరే అధిక్యం

గతానికి భిన్నంగా గడిచిన కొంతకాలంగా దూకుడు నిర్ణయాల్ని ప్రకటిస్తోంది టాటా గ్రూప్.

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:05 AM GMT
ఆ డీల్ పై టాటా గురి పెట్టిందా? వర్కువుట్ అయితే అదిరే అధిక్యం
X

గతానికి భిన్నంగా గడిచిన కొంతకాలంగా దూకుడు నిర్ణయాల్ని ప్రకటిస్తోంది టాటా గ్రూప్. వెనుకా ముందు చూడకుండా భారతీయులంతా నమ్మే అతి కొద్ది బ్రాండ్లలో టాటా ముందుంటుంది. ఆ గ్రూప్ నకు సంబంధించిన ప్రొడక్టు అయితే చాలు.. నాణ్యతకు ఢోకా ఉండదని.. నమ్మకానికి ఏ మాత్రం ఇబ్బంది ఉండదన్నట్లుగా ఉంటుంది. అందుకు తగ్గట్లే.. ఇటీవల కాలంలో ఆ గ్రూపు నుంచి వస్తున్న వివిధ వ్యాపారాలకు.. బ్రాండ్లకు లభిస్తున్న ఆదరణ అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

తాజాగా టాటా గ్రూప్.. ప్రముఖ ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ హల్దీరామ్స్ మీద ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇందులోమెజార్టీ స్టేక్ తీసుకునేందుకు తెర వెనుక కసరత్తు చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మార్కెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారిన ఈ డీల్ సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ.. కొన్ని వివరాలు ఆసక్తికరంగా మారాయి. హల్దీరామ్స్ లో మెజార్టీ వాటా సుమారు 10 బిలియన్ డాలర్లుగా ప్రచారం జరుగుతోంది. రూపాయిల్లో చూస్తే..రూ.83వేల కోట్లకు పైనే. ఈ వాటాను దక్కించుకోవటానికి టాటా గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. హల్దీరామ్స్ తన విలువను అధికంగా చూపిస్తుందన్న మాట వినిపిస్తోంది.

టాటా గ్రూప్ లోని రిటైల్ విభాగమైన టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ హల్దీరామ్స్ లో 51 శాతం వాటాను సొంతం చేసుుకోవటానికి ఆసక్తిని చూపుతుందని చెబుతున్నారు. అయితే.. ఆ సంస్థ చెబుతున్న విలువ ఎక్కువగా ఉందని.. దీనిపై కసరత్తు జరుగుతుందని చెబుతున్నారు. అయితే.. ఇదేం లేదని హైప్ క్రియేట్ చేయటానికే ఇదంతా అన్న మాట కొందరు చెబుతుంటే..కార్పొరేట్ ప్రపంచంలో ఏ డీల్ అయిన ఎప్పుడైనా జరగొచ్చని.. అసాధ్యమైనది ఏమీ లేదంటున్నారు. దేశంలోనపే అది పెద్ద స్నాక్స్ కంపెనీగా ఉన్న హల్దీరామ్స్ కు ఈ రంగంలో 13 శాతం వాటా ఉండటం తెలిసిందే. మార్కెట్ లో జరుగుతున్న చర్చకు తగ్గట్లే.. ఈ బిగ్ డీల్ ఓకే అవుతుందా? లేదా? అన్నది చూడాలి.