Begin typing your search above and press return to search.

దేశంలోనే అత్యంత విలువైన గ్రూపు బ్రాండ్.. విలువ ఎంతంటే?

దేశంలో అత్యంత విలువైన గ్రూపు.. ఆదరణ పొందిన బ్రాండ్ ఏమిటి? తాజాగా వెల్లడైన రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది.

By:  Tupaki Desk   |   27 Jun 2025 2:06 PM IST
దేశంలోనే అత్యంత విలువైన గ్రూపు బ్రాండ్.. విలువ ఎంతంటే?
X

దేశంలో అత్యంత విలువైన గ్రూపు.. ఆదరణ పొందిన బ్రాండ్ ఏమిటి? తాజాగా వెల్లడైన రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. దేశీయంగా ప్రతి భారతీయుడు తన సొంత కంపెనీలా ఫీలయ్యే టాటా గ్రూపు మరో ఘనతను సాధించింది. విలువలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈ గ్రూపు విలువ పరంగా అరుదైన ఘనతను సాధించింది. గ్రూపు విలువ పరంగా 30 బిలియన్ డాలర్లను అధిగమించిన తొలి భారతీయ బ్రాండ్ గా నిలిచింది. ఈ వివరాల్ని బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన రిపోర్టు వెల్లడించింది.

యూకే కేంద్రంగా ఉండే ఈ సంస్థ అంతర్జాతీయంగా బ్రాండ్ వాల్యువేషన్ కన్సల్టెన్సీగా పని చేస్తోంది. 2025 సంవత్సరానికి దేశంలోనే అత్యంత విలువైన టాప్ 10 బ్రాండ్ల విలువ రెండు అంకెల వ్రద్ధి రేటును సొంతం చేసుకుంది. భారత్ లో అత్యంత విలువైన బ్రాండ్ గా టాటా గ్రూపు నిలిచింది. ఈ సంస్థ బ్రాండ్ విలువ ఏడాదిలో 10 శాతం పెరిగింది. దేశంలోని దిగ్గజ 100 బ్రాండ్ల మొత్తం విలువ 236.50 బిలియన్ డాలర్లుగా పేర్కొంది. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.20.46 లక్షల కోట్లు. ఇందులో టాటా గ్రూపు విలువ రూ.2.73 లక్షల కోట్లు ఉండటం విశేషం.

టాప్ 100లో అత్యంత వేగంగా పెరుగుతున్న బ్రాండ్ గా అదానీ గ్రూపు నిలిచింది. ఈ సంస్థ బ్రాండ్ విలువ ఏడాదిలో 82 శాతం పెరిగింది. మౌలిక.. ఇంధన రంగంలో ఈ గ్రూపు సాధించిన వ్రద్ధి దీనికి కారణంగా చెబుతున్నారు.

జాబితాలోకి కొత్తగా వచ్చిన బ్రాండ్ల విషయానికి వస్తే..

- జొమాటో

- బిర్లా ఓపస్

- బిర్లా సాఫ్ట్

ఇదిలా ఉండగా.. ఐటీ టెక్నాలజీ విభాగంలో అగ్రగామి బ్రాండ్ గా ఇన్ఫోసిస్ నిలిచింది. ఆర్థిక రంగ సేవల రంగంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్.. అతిథ్యంలో తాజ్.. ఎఫ్ఎంసీజీలో అమూల్ మొదటిస్థానాల్లో నిలిచాయి.

దేశంలోనే అత్యంత విలువైన భారతీయ బ్రాండ్లు.. వాటి విలువ బిలియన్ డాలర్లలో చూస్తే..

1. టాటా గ్రూపు 31.6 (బిలియన్ డాలర్లు)

2. ఇన్ఫోసిస్ 16.3

3. హెచ్ డీఎఫ్ సీ గ్రూపు 14.2

4. ఎల్ ఐసీ గ్రూపు 13.6

5. రిలయన్స్ ఇండస్ట్రీస్ 9.8

6. ఎస్ బీఐ గ్రూపు 9.6

7. హెచ్ సీఎల్ టెక్ 8.9

8. ఎయిర్ టెల్ 7.7

9. ఎల్ అండ్ టీ గ్రూపు 7.4

10. మహీంద్రా గ్రూపు 7.2

దేశంలోనే పటిష్టమైన టాప్ 10 బ్రాండ్ కంపెనీల విషయానికి వస్తే..

1. తాజ్ హోటల్స్

2. ఏషియన్ పెయింట్స్

3. అమూల్

4. హీరో

5. తనిష్క్

6. మారుతి సుజుకీ

7. రాయల్ ఎన్ ఫీల్డ్

8. ఎల్ ఐసీ

9. ఇండిగో

10. హెచ్ డీఎఫ్ సీ గ్రూపు