Begin typing your search above and press return to search.

టార్గెట్ పెద్దిరెడ్డి...సాధ్యమేనా ?

రాబోయే ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని ఓడించటమే టార్గెట్ గా చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారు.

By:  Tupaki Desk   |   18 Dec 2023 3:30 PM GMT
టార్గెట్ పెద్దిరెడ్డి...సాధ్యమేనా ?
X

రాబోయే ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని ఓడించటమే టార్గెట్ గా చంద్రబాబునాయుడు పావులు కదుపుతున్నారు. పెద్దిరెడ్డిని ఓడించగలిగితే మొత్తం చిత్తూరు జిల్లాలో టీడీపీ జెండాను ఎగరేయచ్చని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికపై పెద్ద ఎత్తున కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా పుంగనూరు, తంబళ్ళపల్లి, పలమనేరు, పీలేరు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. తంబళ్ళపల్లి అసెంబ్లీలో పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారక నాథ్ రెడ్డిని ఓడించాలని, రాజంపేట పార్లమెంటులో కొడుకు మిథున్ రెడ్డి ఓటమే ధ్యేయంగా పావులు కదుపుతున్నారు.

అందుకనే తంబళ్ళపల్లి మాజీ ఎంఎల్ఏ ప్రవీణ్ కుమార్ రెడ్డిని చంద్రబాబు సీనులోకి తీసుకొస్తున్నారు. ప్రవీణ్ చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తంబళ్ళపల్లిలో టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే ప్రవీణ్ తో చర్చలు జరుపుతున్నారు. ఇక పుంగనూరులో చల్లాబాబును గతంలోనే అభ్యర్ధిగా ఎంపికచేసినా అంతకన్నా గట్టి అభ్యర్ధి దొరుకుతారేమోనని చూస్తున్నారు. పలమనేరులో మాజీమంత్రి అమర్నాధరెడ్డే ఉన్నారు. పోయిన సారి ఓడిపోయినా రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అమర్ పట్టుదలతో నియోజకవర్గంలో పనిచేస్తున్నారు.

ఇక పీలేరులో చింతల రామచంద్రారెడ్డి ని ఓడించేందుకు కిషోర్ కుమార్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలో కిషోర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కుప్పంలో వైసీపీ అభ్యర్ధి భరత్ ను ఓడించకపోతే టీడీపీ మనుగడకే దెబ్బపడిపోవటం ఖాయం. ఎందుకంటే ఇక్కడ గనుక చంద్రబాబు ఓడిపోతే చాలా కష్టాలను ఎదుర్కోవాల్సుంటుంది. ఇక రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు గుర్రాన్ని చంద్రబాబు రెడీ చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం.

పై నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపుకు వ్యూహాలు పన్నుతునే ప్రత్యేకంగా పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమిపైన చంద్రబాబు దృష్టిపెట్టారు. పెద్దిరెడ్డిని గనుక ఓడించగలిగితే జిల్లాలో వైసీపీ బలం సగానికి పడిపోతుందన్నది చంద్రబాబు ఆలోచన. ప్రస్తుతం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో టీడీపీకి ఉన్నది కుప్పం సీటు మాత్రమే. అంటే పెద్దిరెడ్డిని ఓడించగలిగితే తక్కువలో తక్కువ 8 సీట్లలో టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. జిల్లాలో 8

సీట్లలో గెలిస్తే టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని చంద్రబాబు అంచనా వేసుకుంటున్నారు. మరి పెద్దిరెడ్డిని టార్గెట్ చేయడం సాధ్యమవుతుందా ?