తారామతిలో ‘మోర్ దేన్ ఫ్రెండ్స్ ’ ఈవెంట్ లో షాకింగ్ నిజాలు
ఈ పార్టీకి దాదాపు 400 మంది వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరిలో 35 మందిని పరీక్షించినట్లుగా చెప్పినా.. దాదాపు అరవై మంది వరకు పరీక్షలు జరిపారని తెలుస్తోంది.
By: Garuda Media | 6 April 2026 12:30 PM ISTతారామతి బారాదరి రిసార్ట్ లో ఏర్పాటు చేసిన పార్టీలో డ్రగ్స వినియోగం జరగటం.. శనివారం అర్థరాత్రి ఈగిల్ పోలీసులు తనిఖీలు నిర్వహించటం ఆరుగురు డ్రగ్స్ వినియోగం జరిపినట్లుగా గుర్తించి.. వారిని డీ అడిక్షన్ సెంటర్ కు తరలించటం తెలిసిందే. చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందిన ఇందులో నిర్వహించిన మత్తుపార్టీలో పెద్ద ఎత్తున లిక్కర్ సర్వ్ చేయటం షాకింగ్ గా మారింది. కారణం.. ఈ పార్టీకి సంబంధించి ఎక్సైజ్ శాఖ నుంచటి అనుమతులు తీసుకోకుండానే పెద్ద ఎత్తున మద్యాన్ని వచ్చిన అతిధులకు అందించటం చూస్తే.. నిబంధనల్ని ఏ మాత్రం పట్టించుకోలేదన్న విషయం అర్థమవుతుంది.
ఈ పార్టీకి దాదాపు 400 మంది వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరిలో 35 మందిని పరీక్షించినట్లుగా చెప్పినా.. దాదాపు అరవై మంది వరకు పరీక్షలు జరిపారని తెలుస్తోంది. వీరిలో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లుగా గుర్తించారు. వీరిలో బాలీవుడ్ నటుడు కం మోడల్ అబ్దుల్ సర్వర్.. యోగేశ్వర్.. అభినాశ్ ఫణి.. బ్రెట్ జాసన్.. నిహార్, ఆషి (వీరిద్దరూ భార్యభర్తలు) కొకైన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మోరే దేన్ ఫ్రెండ్స్ పేరుతో నిర్వహించిన ఈ మత్తు పార్టీ కఫుల్ ఫ్రెండ్లీగా పెద్ద ఎత్తున ప్రచారం చేయటం గమనార్హం. ఈ కారణంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జంటలు రావటం విశేషం. ఈ ఈవెంట్ గురించి హైదరాబాద్ కంటే ఎక్కువగా ఢిల్లీ.. ముంబయి.. బెంగళూరు నుంచి విద్యార్థులు.. యూత్ హాజరైనట్లుగా గుర్తించారు.
ఈ పార్టీని నిర్వహించిన వ్యక్తిని చంద్రగా భావిస్తున్నారు. తెర వెనుక వేరే వారు ఉంటారని తెలుస్తోంది. వీరికిడ్రగ్స్ ఎలా వచ్చాయన్న దానిపై ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా ఈ పార్టీని నిర్వహించటం చూస్తే.. అంత పబ్లిక్ గా పార్టీ నిర్వహస్తూ కనీస అనుమతులు తీసుకొని బరితెగింపు ఏమిటి? అన్నది ప్రశ్న.
తారామతి బారాదరిలో నిర్వహించిన ఈవెంట్ ను మ్యూజిక్ జోనర్ ఇష్టపడే వారి కోసమన్నట్లుగా ప్రచారం జరిగింది. 400 ఏళ్ల నాటి గోల్కొండ కోట పరిసరాల్లో.. ఆధునిక లైటింగ్ మధ్య భిన్నమైన సౌండ్ సిస్టమ్ తో విభిన్నమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నట్లుగా భారీ ప్రచారం చేయటంతో ఆ పార్టీకి వేర్వేరు నగరాల నుంచి పెద్ద ఎత్తున హాజరైనట్లుగా చెబుతున్నారు. పోలీసుల దాడుల్లో నాలుగు గ్రాముల కొకైన్.. నాలుగు గ్రాముల ఎండీఎంఏ పిల్స్ తో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు నిర్వహించిన తర్వాత డ్రగ్స్ వినియోగంతో సంబంధం లేని వారి వివరాల్ని సైతం పోలీసులు సేకరించి పంపినట్లుగా తెలుస్తోంది.
