Begin typing your search above and press return to search.

మాజీ హోం మంత్రి పోరు పడలేక జనసేనలోకి ?

ఆమె వైసీపీలో అత్యంత కీలక నాయకురాలు. హోం మంత్రిగా ఘనమైన బాధ్యతలు చేపట్టారు.

By:  Tupaki Desk   |   8 May 2025 1:30 AM
Speculations Rise Over Taneti Vanitha’s Future in YSRCP
X

ఆమె వైసీపీలో అత్యంత కీలక నాయకురాలు. హోం మంత్రిగా ఘనమైన బాధ్యతలు చేపట్టారు. మొత్తం అయిదేళ్ళ పాటు జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసి అధినేత అభిమానం చూరగొన్నారు. ఆమె తానేటి వనిత. అయితే ఆమె అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా పార్టీ క్యాడర్ ని పట్టించుకోరని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇంటి వద్ద ఆమె దర్శనం కావాలంటే కనీసంగా రెండు నుంచి మూడు గంటలు సమయం పడుతుందని క్యాడర్ గోల పెడుతోంది.

ఇక ఆమె ఉండేది ఒకచోట ఇంచార్జిగా బాధ్యతలు చూసేది మరో చోట అని అంటున్నారు. దాంతో క్యాడర్ తో విపరీతంగా గ్యాప్ వస్తోంది అని అంటున్నారు. ఇక ఆమె ఎక్కడ ఉంటే అక్కడ తన వర్గం అని సొంతంగా తయారు చేసుకుని మిగిలిన నాయకులను ఎదగకుండా వర్గ పోరుని ప్రోత్సహిస్తారు అన్న పేరుని మూటకట్టుకున్నారని సొంత పార్టీ వారే చెబుతారు.

మరో వైపు చూస్తే తానేటి వనిత 2009లో టీడీపీ నుంచి గోపాలపురం ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నాటికి వైసీపీకి షిఫ్ట్ అయి కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ వేవ్ లో ఎమ్మెల్యే అయ్యారు. ఎకాగా హోం మంత్రి కూడా అయ్యారు. అలా అయిదేళ్ళ పాటు ఆమె అధికారాన్ని చలాయించారు

అయితే కొవ్వూరులో వర్గ పోరు బాగా పెరిగిపోయింది. ఆమె ఉంటే పార్టీ గెలవదని నెత్తీ నోరు మొత్తుకుని పార్టీ క్యాడర్ అధినాయకత్వానికి చెప్పడంతో ఆమెను 2024 ఎన్నికల ముందు గోపాలపురానికి హైకమాండ్ షిఫ్ట్ చేసిందట. తీరా అక్కడికి వెళ్ళినా ఓటమి తప్పలేదు. ఇక చూస్తే ఓటమి తరువాత ఆమె పెద్దగా యాక్టివ్ కాలేదని అంటారు.

అయితే ఇటీవల జగన్ ని కలవడంతో తిరిగి క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు అని అంటున్నారు. దాంతో ఆమె గోపాలపురంలో పార్టీ మీద దృష్టి పెట్టారు కానీ వర్గ పోరు అంతే స్థాయిలో ఉందై అంటున్నారు. 2019లో వైసీపీ తరఫున గోపాలపురం నుని ఎమ్మెల్యేగా గెలిచిన తలారి వెంకటరావు అక్కడ బలమైన వర్గంతో ఉన్నారు. దాంతో ఆయన వర్గాన్ని దూరం చేసే పనిలో మాజీ హోం మంత్రి బిజీగా ఉన్నారని అంటున్నారు.

అంతే కాదు క్యాడర్ కి అందుబాటులో ఉండడంలేదుట. ఈ పరిణామాలతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న కాపు నేతలను పట్టించుకోవడం లేదని అంటున్నారు. దాంతో వారు జనసేనలోకి వెళ్ళాలని చూస్తున్నారుట. ఇక తలారి తనకు పోటీ అవుతారని భావించి ఏకంగా వర్గ పోరుకు ఇంచార్జిగా ఉన్న ఆమె తెర తీస్తున్నారుట.

దీంతో పార్టీ నాయకులకు ఆ నియోజకవర్గం నాయకులు తమ ఇంచార్జి గురించి బాహాటంగానే చెబుతున్నారుట. అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే గోపాలపురం మరో ఎత్తు అని వారు ఇటీవల గోపాలపురం పార్టీ మీటింగ్ కి వచ్చిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల్తో గోడు వెళ్ళబోసుకున్నారుట.

ఇవన్నీ చూస్తూంటే వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుని వనితను గోపాలపురం నుంచి మళ్ళీ ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తుందా అన్న చర్చ సాగుతోంది. అదే కనుక జరిగితే ఆమెకు ఎక్కడ సీటు ఇస్తారు అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఇక ఏ చోటకు షిఫ్ట్ చేసినా ఆమె వైఖరిలో మార్పు లేకపోతే మాత్రం ఇబ్బందే అని అంటున్నారు. సో ఇదన్న మాట మాజీ హోం మంత్రి గారి పొలిటికల్ మ్యాటర్.