Begin typing your search above and press return to search.

తమిళనాట విజయ్ పార్టీతో డీఎంకే...అన్నాడీఎంకే షేక్...!?

ఇక విజయ్ తాను కొత్తగా ప్రారంభించిన పార్టీ పేరును తమిళగ వెట్రి కజగంగా డిసైడ్ చేశారు. తన పార్టీ తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు.

By:  Tupaki Desk   |   5 Feb 2024 4:30 PM GMT
తమిళనాట విజయ్ పార్టీతో డీఎంకే...అన్నాడీఎంకే షేక్...!?
X

విజయ్ తమిళ సూపర్ స్టార్. రజనీకాంత్ తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో. సూపర్ స్టార్ డం ని ఈ రోజున అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న విజయ్ చూపు పాలిటిక్స్ మీద పడింది. ఆయన రాజకీయాల్లోకి వస్తారు అని చాలా కాలంగా ప్రచారంలో ఉన్నా దాన్ని ఆయన ఎట్టకేలకు నిజం చేస్తున్నారు.

ఇక విజయ్ తాను కొత్తగా ప్రారంభించిన పార్టీ పేరును తమిళగ వెట్రి కజగంగా డిసైడ్ చేశారు. తన పార్టీ తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. అంటే తమిళనాడులో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు 2026 లో ఎన్నికల్లో తమిళనాడులో పోటీ చేస్తానని ప్రకటించారు.

విజయ్ అంటే అన్ని వర్గాల హీరోగా ఉన్నారు. ముఖ్యంగా యూత్ ఆయన పట్ల విపరీతంగా అభిమానంతో ఉంటారు. తమిళనాడులో రెండు పార్టీల కల్చర్ ఉంది. అయితే డీఎంకే లేకపోతే అన్నాడీఎంకే అన్నట్లుగా అక్కడ రాజకీయం దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది.

అయితే 2016లో జయలలిత మరణించాక అన్నాడీఎంకేలో నాయకత్వ సమస్య ఉంది. అదే టైం లో డీఎంకే కి స్టాలిన్ ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ రెండు తరాల వారులుగా ఉన్నారు. ఇక అన్నాడీఎంకే ప్రతిపక్షంలో ఉంది. ద్రవిడ పార్టీలకు నాయకులు ఎవరైనా క్యాడర్ మాత్రం పార్టీ కోసం కట్టుబడిపోతుంది.

వారు ఎప్పటి నుంచో తమ పార్టీకే ఓటు వేస్తారు. అందుకే అన్నాడీఎంకే ఇప్పటికీ అలా నిలబడింది. అయితే అన్నా డీఎంకే నాయకత్వం కోసం చాలా పోటీ ఉంది. అన్నాడిఎంకెకు మాజీ సిఎం పళనిస్వామి ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నారు కానీ పన్నీర్‌ సెల్వం శశికళ వంటి వారు పార్టీ నాయకత్వ పదవిని కైవసం చేసుకునేందుకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇది క్యాడర్‌లో ఇబ్బందిపెట్టేలా ఉంది. అలాగే అన్నాడీఎంకేలో నెలకొన్న అనిశ్చితి వల్ల పార్టీ కార్యకర్తలు అయితే ఎన్నడూ లేని విధంగా విసిగి ఉన్నారని అంటున్నారు. అలా వారితో పాటు ఆ అన్నాడీఎంకేకు చెందిన ఓటర్లు పెద్ద ఎత్తున విజయ్ వైపు చూసే అవకాశం ఉందని అంటున్నారు.

దాంతో పాటు డీఎంకే అయిదేళ్ళ పాలన వల్ల ఏర్పడిన ప్రయా వ్యతిరేక ఓట్లను సైతం కొత్త పార్టీగా విజయ్ తిప్పుకునే అవకాశాలు బాగానే ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా రెండే పార్టీలను చూసిన జనాలకు పక్కా మాస్ ఫాలోయింగ్ సినీ గ్లామర్ తో పార్టీ పెడుతున్న విజయ్ ఒక ప్రధాన ఆప్షన్ గా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

అదే విధంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాట రాజకీయ పోలరైజేషన్ కూడా జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. అదేలా అంటే నామ్ తమిళర్ కట్చి, ఎండీఎంకే, పీఎంకే, టీఎంసీ వంటి చిన్న పార్టీలు విజయ్ రాజకీయ ప్రవేశంతో ఆ పార్టీలో విలీనం అయ్యే పరిస్థితులు కూడా కనిపించవచ్చు అంటున్నారు.

అలాగే అన్ని చిన్న పార్టీలను మూడవ కూటమి వైపుగా ఉన్న తన వైపునకు తిప్పుకుంటూ విజయ్ డీఎంకేకు అతి పెద్ద ఆల్టరేషన్ అయ్యే చాన్స్ ఉందని అంతున్నారు. అలాగే అన్ని చిన్న పార్టీల ఓటు బ్యాంకును కూడా విజయ్ తన వైపుగా సునాయాసంగా తిప్పుకోగలుగుతారు అని విశ్లేషిస్తున్నారు.

ఇక ఈ రోజుకు విజయ్ కేవలం సినిమా నటుడిగా మాత్రమే ఉన్న రానున్న రెండేళ్ల కాలం ఆయనను తమిళ ప్రజలకు సీరియస్ పొలిటీషియన్ గా కమిట్ మెంట్ ఉన్న లీడర్ గా ఎలా చూపించబోతోంది అన్నదే ఆసక్తికరమైన అంశం. ఏది ఏమైనా విజయ్ పార్టీ మాత్రం తమిళ రాజకీయాన్ని చాలా వరకూ ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.