Begin typing your search above and press return to search.

గోమూత్రం కాదు గోముద్ర!

ఈ సందర్భంగా ఆమె తన ప్రసంగంలో తాను ప్రాతినిధ్యం వహించే తమిళనాడుకు చెందిన ఎంపీ చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   9 Dec 2023 4:09 AM GMT
గోమూత్రం కాదు గోముద్ర!
X

ఉత్తరాది రాష్ట్రాలు గోమూత్రానికి నిదర్శనమంటూ తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపటంతో పాటు.. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తవుతోంది. ఈ వ్యాఖ్యల్ని రికార్డుల్లో తొలగించటం.. సదరు నోరుపారేసుకున్న డీఎంకే ఎంపీ క్షమాపణలు చెప్పటం లాంటివి జరిగినా.. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ వాట్సాప్ గ్రూపుల్లో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి వేళ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని గుజరాత్ వర్సిటీలో జరిగిన కల్చరల్ ఎకానమీ సమ్మిట్ కు హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై.

ఈ సందర్భంగా ఆమె తన ప్రసంగంలో తాను ప్రాతినిధ్యం వహించే తమిళనాడుకు చెందిన ఎంపీ చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దురద్రష్టకరమన్న తమిళ సై.. తాను కూడా తమిళనాడు నుంచే వచ్చానని.. ఈ మధ్యన కొందరు ఉత్తర-దక్షిణ విభజన తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ఈ కారణంగానే తాను చెప్పాల్సి వస్తుందన్న ఆమె.. ''నేను తమిళనాడు నుంచే వచ్చాను. మా రాష్ట్రానికి చెందిన ఎంపీ ఉత్తరాది రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలుగా వ్యాఖ్యానించటంపై బాధ పడుతున్నా. సౌత్ -నార్త్ అన్న విభజన ఉండకూడదు. పరస్పరం గౌరవించుకోవాలి'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రజల్లో ఉన్న ఒక సంప్రదాయాన్ని చెప్పుకొచ్చారు.

పూర్వం తమిళనాడులో ప్రజలు తమ ఇంట్లోని దేవుడి ముందు ఒక హుండీ ఉంచేవారని చెబుతూ.. ''అందులో నిత్యం డబ్బులు వేసేవారు. అలా పొదుపు చేసిన సొమ్ముతో తమ జీవితంలో కనీసం ఒక్క సారైనా కాశీయాత్ర (ఇప్పటి వారణాసి) చేయాలని భావించేవారు. తమిళనాడు ప్రజలు తమ రాష్ట్రంలోని రామేశ్వరం ఆలయాన్ని సందర్శించి.. ఉత్తరాదిన ఉండే కాశీని సందర్శించేవారు. ఈ రెండింటిని వేర్వేరుగా చూడరు. కాశీని సందర్శించే వారు తమ తీర్థయాత్రను సంపూర్ణం చేసుకోవటానికి రామేశ్వరం కూడా వస్తారు. అలానే రామేశ్వరం వచ్చిన వారు కాశీని కూడా సందర్శిస్తారు'' అంటూ దేశంలో ఉత్తర.. దక్షిణ ప్రాంతాలన్న బేధ భావం సరికాదన్న విషయాన్ని స్పష్టం చేశారు.