పిల్లల పేర్లు విషయంలో తగ్గొద్దంటున్న సీఎం!
అవును... జాతీయ విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 May 2025 9:38 AM ISTతమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, వాణిజ్య సంస్థలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, ప్రభుత్వ ఉత్తర్యులు అన్ని తమిళంలోనే ఉండాలని స్టాలిన్ సర్కార్ ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. అలాకానిపక్షంలో జరిమానాలు తప్పవని హెచ్చరిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పిల్లల పేర్ల విషయంలోను కీలక సూచన చేశారు స్టాలిన్.
అవును... జాతీయ విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా అప్పటి నుంచి స్టాలిన్ సర్కార్ తగ్గడం లేదు! ఇందులో భాగంగా... ఇకపై రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా వారి వారి సంతకాలను తమిళ భాషలోనే పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదే క్రమంలో తాజాగా... తమిళనాడు ప్రజలు వారి పిల్లలకు తమిళ పేర్లే పెట్టాలని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ కోరారు. ఈ సందర్భంగా మన దైనందిన జీవితంలో తమిళాన్ని మరింతగా భాగం చేసుకోవాలని.. తమిళనాడులో బ్రతికే మన బిడ్డలకు ఇంగ్లిష్ లేదా ఉత్తరాది పేర్లు పెట్టుకునే అలవాటును మార్చుకోవాలని సూచించారు.
కాగా... ఇటీవల చెన్నైలో జరిగిన డీఎంకే ఎమ్మెల్యే వేలు కుమార్తె పెళ్లి కార్యక్రమంలోనూ ఆయన ఇదే ఆకాంక్షను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పిల్లలకు పెట్టడానికి తమిళ పేర్లు, వాటి అర్ధ వివరణలతో కూడిన ప్రత్యేక వెబ్ సైట్ ను ప్రారంభించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
డీఎంకే నాయకులు, కార్యకర్తల ఇంటి శుభకార్యాలకు హాజరయ్యే స్టాలిన్.. పుట్టబోయే పిల్లలకు అందమైన తమిళ పేర్లు పెట్టాలంటూ కుటింబీకులకు సూచించడం పరిపాటిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... తమిళ అభివృద్ధి శాఖ లేక తమిళ్ వర్చువల్ అకాడమీ ద్వారా వెబ్ సైట్ రూపొందిస్తే బాగుంటుందని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విషయంలో మరోసారి నొక్కి చెప్పారు. ఇందులో భాగంగా... తమిళనాడు ప్రజలు వారి పిల్లలకు తమిళ పేర్లే పెట్టాలని.. మన దైనందిన జీవితంలో తమిళాన్ని మరింతగా భాగం చేసుకోవాలని సూచించారు.
