Begin typing your search above and press return to search.

అన్నామ‌లై ఎఫెక్ట్‌: ఖాళీ అయిన త‌మిళ‌నాడు బీజేపీ!

ఈప్ర‌భావం కూడా తాజాగా త‌మిళ‌నాడులో క‌నిపిస్తోంది. అనేక మంది యువ‌త అన్నామ‌లై.. సోష‌ల్ మీడి యాను ఫాలో అవుతున్న‌ట్టు తెలిపారు.

By:  Garuda Media   |   6 Jun 2026 8:00 PM IST
అన్నామ‌లై ఎఫెక్ట్‌: ఖాళీ అయిన త‌మిళ‌నాడు బీజేపీ!
X

త‌మిళ‌నాడు బీజేపీలో ఖాళీ అయింది. కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న‌వారు.. త‌మ త‌మ ప‌ద‌వులు వ‌దులుకుని.. పార్టీకి ఇటీవ‌ల రాజ‌నామా చేసి.. ఉద్య‌మ ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన అన్నామ‌లై వెంట న‌డిచేందుకు సిద్ధ‌మ‌య్యారు. త‌మిళ‌నాడులోని 11 జిల్లాల‌కు చెందిన బీజేపీ అధ్య‌క్షులు మూకుమ్మ‌డి రాజీనామా చేయ‌డం.. క‌నీసం.. ఈ రాజీనామాలు ఆమోదం పొందేవ‌ర‌కైనా వేచి చూడ‌కుండానే.. అన్నామ‌లై వెంట న‌డుస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ముఖ్యంగా చెన్నై స‌హా చామ‌రాజ‌న‌గ‌ర్‌, రామేశ్వ‌రం వంటి బ‌ల‌మైన బీజేపీకి వెన్నుద‌న్నుగా ఉన్న జిల్లా ల్లోనే బీజేపీ ఖాళీ అయిపోయింది. జిల్లా అధ్య‌క్షులే పార్టీకి రాజీనామా చేయ‌డంతో ఇక్క‌డి పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా జెండా వ‌దిలేశారు. వంద‌ల మంది త‌మ నాయ‌కుల వెంటే న‌డుస్తామ‌ని తేల్చి చెప్పారు. మ‌రోవైపు.. అన్నామ‌లై.. త‌న‌కు న‌టుడు ర‌జనీకాంత్ మ‌ద్ద‌తు ఉంద‌ని.. గ‌తంలోనే ఆయ‌న త‌న వెంట న‌డ‌వాల‌ని పిలుపునిచ్చార‌ని చెప్పిన విష‌యం తెలిసిందే.

ఈప్ర‌భావం కూడా తాజాగా త‌మిళ‌నాడులో క‌నిపిస్తోంది. అనేక మంది యువ‌త అన్నామ‌లై.. సోష‌ల్ మీడి యాను ఫాలో అవుతున్న‌ట్టు తెలిపారు. కేవ‌లం 10 గంట‌ల్లోనే 12 ల‌క్ష‌ల మంది అన్నామ‌లై ప్ర‌క‌టించిన ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెలుపుతున్నట్టు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇంత జ‌రుగుతున్నా బీజేపీ మాత్రం త‌మ‌కు ఏమీ కాద‌ని, పోయే వారంతా.. పోయినా.. ప్ర‌జ‌లు త‌మ వెంటే ఉన్నార‌ని పార్టీ రాష్ట్ర చీఫ్ నైనార్ నాగ్రేంద్ర ప్ర‌క‌టించారు.

చిత్రం ఏంటంటే.. ఆయ‌న‌కు పీఏలుగా ఉన్న న‌లుగురిలో ఇద్ద‌రు రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీంతో బీజేపీ భారీ స్థాయిలో న‌ష్ట‌పోయే అవ‌కాశం క‌నిపిస్తోంది. పార్టీ మాట ఎలా ఉన్నా.. స్థానికంగా ఇప్పుడిప్పుడే బ‌లం పుంజ‌నుకుంటున్న బీజేపీకి, నాయ‌కుల‌కు ఈ ప‌రిణామం కంటిపై కునుకు లేకుండా చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల‌ను బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం నిశితంగా గ‌మ‌నిస్తోంద‌ని.. పార్టీలోనే అంద‌రూ ఉండేలా చర్య‌లు తీసుకుంటున్నామ‌ని నాగేంద్ర తాజాగా మ‌రోసారి ప్ర‌క‌టించారు.