Begin typing your search above and press return to search.

ఇదే మంచి టైం.. జ‌నంలో వెళ్తారా త‌మ్ముళ్లూ.. !

చిన్న చిన్న లోపాలు ఎలా ఉన్నా.. ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధిదారులుగా ఉన్న మెజారిటీ కుటుంబాలు మా త్రం ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి

By:  Tupaki Desk   |   17 Jun 2025 9:00 AM IST
ఇదే మంచి టైం.. జ‌నంలో వెళ్తారా త‌మ్ముళ్లూ.. !
X

ముద్దొచ్చిన‌ప్పుడే చంకెక్క‌మ‌న్న‌ట్టుగా.. నాయ‌కులు కూడా.. ప్ర‌జ‌ల నాడిని.. వారి మ‌న‌సును గుర్తెరిగి న‌డు చుకుంటే.. దీనికి మించిన స‌మ‌యం.. ఉంటుందా? అదేవిధంగా ఇప్పుడు ఇదే స‌రైన స‌మ‌యం అంటూ .. టీడీపీలో ఒక చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో ఉన్నా.. లేకున్నా.. ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు ఇదే స‌రైన స‌మ‌యం అంటున్నారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న `త‌ల్లికి వంద‌నం` ప‌థకం ప్ర‌జ‌ల్లో ఆనందాన్ని తీసుకువ‌చ్చింది.

చిన్న చిన్న లోపాలు ఎలా ఉన్నా.. ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధిదారులుగా ఉన్న మెజారిటీ కుటుంబాలు మా త్రం ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి. చంద్ర‌బాబు చిత్ర ప‌టాల‌కు పాలాభిషేకం కూడా చేస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తే.. ఆ జోష్ వేరేగా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యంపై సీనియ‌ర్ నాయ‌కులు కూడా చెబుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల నాడి త‌మ‌కు అనుకూలంగా ఉంద‌ని.. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి.. మ‌ళ్లీ మ‌ళ్లీ త‌మ ప్ర‌భుత్వం ఎందుకు అవ‌స‌ర‌మో.. వివ‌రించాల‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాలు కొత్త‌కాదు. వైసీపీ హ‌యాంలోనూ ప‌థ‌కాలు ఇచ్చారు. కానీ, ఇలా.. ఒకే కుటుం బంలో ఎంత మంది ఉన్నా.. అంత‌మందికీ మాత్రం ఇవ్వ‌లేదు. ఇది టీడీపీకి `డ‌బుల్ ప్ల‌స్‌`. దీంతో ఈ ప‌థ‌కం కింద ల‌బ్ధి పొందిన వారిని..క‌లిసి, వారి ద్వారా మ‌రోనాలుగు కుటుంబాల‌ను మ‌చ్చిక చేసుకునే అవ‌కాశం నాయ‌కుల‌కు, ఎమ్మెల్యేల‌కు, ఎంపీల‌కు కూడా ఉంది. దీనిని స‌ద్వినియోగం చేసుకునే స‌మ‌యం కూడా ఇదేన‌న్న‌ది సీనియ‌ర్లు చెబుతున్న మాట‌.

ఇత‌ర లోపాలు ఉన్నా.. వాటిని తుడిచి పెట్టేందుకు, ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న కొన్ని అసంతృప్తుల‌ను త‌గ్గించేం దుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ని లెక్క‌లు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నాయ‌కులు ముందుకు క‌ద‌లేం దుకు.. దీనికి మించిన స‌మ‌యం రాబోద‌ని అంటున్నారు. ఈ దిశ‌గా అడుగులు వేస్తే.. మంచి రిజ‌ల్ట్ కూడా వ‌స్తుంద‌ని అంటున్నారు. మ‌రి నాయ‌కులు ఏం చేస్తారో చూడాలి. ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు మాత్రం త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం జోష్‌లో ఉన్నార‌న్న‌ది వాస్త‌వం. దీనిని వాడుకుంటే త‌మ్ముళ్ల‌కు పండ‌గే!!