'తల్లికి వందనం'.. మరిచిపోకుండా.. మరుపు లేకుండా... !
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల ప్రారంభించిన `తల్లికి వందనం` పథకంపై సర్వత్రా సంతృప్తి వ్యక్త మవుతోంది.
By: Tupaki Desk | 26 Jun 2025 3:57 PM ISTప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల ప్రారంభించిన 'తల్లికి వందనం' పథకంపై సర్వత్రా సంతృప్తి వ్యక్త మవుతోంది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఇది కీలకం. ప్రతి ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంతమందికీ రూ.13000 చొప్పున వారి వారిఖాతాల్లో జమ చేశారు. ఇది దాదాపు 89 శాతం మేరకు పూర్తయిందనిప్రభుత్వం చెబుతోంది. ఇంకా అందని వారు.. లేదా అంగన్ వాడీల్లో చదివే పిల్లలకు జూలై 5న వేయనున్నట్టు కూడా ప్రకటించింది.
ఇదిలావుంటే.. ఏం చేసినా.. దానికి సంబంధించిన ఫలితం ఎలా ఉందన్న విషయాన్ని పరిశీలించుకునే లక్షణం ఉన్న సీఎం చంద్రబాబు.. తాజాగా అదే ఫార్ములాను ఇప్పుడు కూడా అమలు చేశారు. ఐవీఆర్ ఎస్ సర్వేల ద్వారా.. సర్కారు సేకరించిన తల్లికి వందనం ఫీడ్ బ్యాక్‌లో ప్రజల్లో సంతృప్తి పాళ్లు పెరిగాయని సీఎం చంద్రబాబు అంచనా వేశారు. అయితే.. కొన్నికొన్ని చోట్ల మాత్రం ఇంకా తమకు అందలేదని కొందరు చెప్పుకొచ్చారు. మరికొన్ని చోట్ల తక్కువ మొత్తంలోనే నిధులు పడ్డాయి.
ఈ విషయాలు కూడా సీఎం దృష్టికి వచ్చాయి. దీంతో ఆయా తప్పులను సరిదిద్దాలని సీఎంవో ద్వారా అధి కారులకు ముఖ్యమంత్రి సూచించారు. అన్ని తప్పులు సరిచేయాలని పేర్కొన్నారు. మరోవైపు.. తల్లికి వందనం.. అమ్మ ఒడికి తేడాపై రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 1వ తేదీ నుంచి పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు కాదు.. ఈ సొమ్ములు అందుకున్న తల్లిదండ్రులే పాల్గొనేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది. తద్వారా.. ప్రజల మనసుల్లో.. ఈ పథకం చెరగని ముద్ర వేస్తుందన్న ఆసక్తి ఉంది.
ఈ పోటీల్లో భాగంగా.. తల్లికి వందనం పథకంలో లబ్ధి పొందిన తల్లిదండ్రులు.. వ్యాస రచన, డిబేట్, ఎల క్యూషన్, చిత్రలేఖనం, డిజిటల్ వీడియో రూపకల్పన వంటి వాటిలో పాల్గొనవచ్చు. తద్వారా వారికి బహు మానాలను కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. ఒకవైపు ప్రజల్లో సంతృప్తి.. మరోవైపు.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించడంతో సర్కారుకు ఈ పథకం మరింత మేలు చేస్తుందని సీఎం చంద్రబాబు తలపోస్తున్నారు. ఇలాంటి కీలక పథకాన్ని మరుసటి ఏడాది వరకు ప్రజలు మరిచిపోకుండా చేయాలని భావిస్తున్నారు.
