ప్రాణాలే పోతున్నాయి.. మేకప్ ప్రొడక్ట్స్‌తో జాగ్రత్త..!
అయితే ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావంతో మేకప్ వీడియోలు, ట్యుటోరియల్స్, ముక్‌బాంగ్ లాంటి విషయాలు విపరీతంగా పాపులర్ అయ్యాయి.
By: Tupaki Desk | 6 Jun 2025 2:00 AM ISTమహిళల జీవితంలో మేకప్‌కి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావంతో మేకప్ వీడియోలు, ట్యుటోరియల్స్, ముక్‌బాంగ్ లాంటి విషయాలు విపరీతంగా పాపులర్ అయ్యాయి. అందుకే కొందరు బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్స్‌ను ఆకట్టుకోవడంలో పడ్డ మోజుతో కొన్ని ప్రమాదకరమైన పనులు చేయడాన్ని అలవాటుగా మార్చుకుంటున్నారు. తైవాన్‌కు చెందిన ఒక యువ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన అలాంటి ఓ చర్య ఆమె జీవితాన్నే బలిగొన్న విషాదకర ఘటన ఇది.
- మేకప్ టేస్టింగ్... ప్రాణాలతో చెలగాటం
ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వేదికలపై మేకప్ ముక్‌బాంగ్ వీడియోలతో ఎంతో గుర్తింపు పొందింది. ప్రత్యేకంగా మేకప్ ఉత్పత్తుల మీద కామెడీ కోణంలో వీడియోలు చేస్తూ, వాటిని చాకచక్యంగా ఉపయోగించడాన్ని చూపిస్తూ ఓ పెద్ద ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. కానీ ఆమె అసలైన వైరల్ ఎఫెక్ట్ వచ్చిందంతా మేకప్ ప్రొడక్ట్స్‌ను నోటిలో పెట్టి టేస్ట్ చేస్తూ చేసిన వీడియోల ద్వారానే. దీన్ని ఓ వినోదంగా భావించినప్పటికీ, అది ఆమె ఆరోగ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తూ ఉండడం తాను గుర్తించలేదు.
ఫౌండేషన్, లిప్‌స్టిక్, కంటి పెన్సిల్‌లు ఇలా అనేక రకాల ప్రొడక్ట్స్‌ను నిజంగానే నోటికి తాకిస్తూ వీడియోలు చేయడం ఆమెకు మంచి స్టార్‌డమ్‌ను తెచ్చినా, అది ప్రమాదకర నిర్ణయమై మారింది. ఇప్పుడీ ఫేమ్ ఆమెకు బదులుగా శోకం తీసుకొచ్చింది. వయసు ఇంకా 24 మాత్రమే అయినా, ఆమె మృత్యువాత పడింది. కుటుంబ సభ్యుల ప్రకారం ఆమె ఆకస్మికంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మరణించింది. కానీ అసలు కారణం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
- నిపుణుల హెచ్చరిక
డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నది ఒక్కటే మేకప్ ఉత్పత్తులలో వాడే కెమికల్స్ తినడానికి అనువైనవి కావు. అవి చర్మానికి మాత్రమే పరిమితంగా వాడాల్సినవి. వాటిని టేస్ట్ చేయడం వల్ల జీర్ణత వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. కొన్ని సమయాల్లో అలర్జీలు, గాఢవిష ప్రభావాలు, అవయవాల దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.
అంతేకాకుండా మేకప్ వేసిన తర్వాత తీసేసే పద్ధతిలోనూ శ్రద్ధ అవసరం. ముఖానికి వేసిన మేకప్‌తో అలానే పడుకోవడం వల్ల చర్మ సమస్యలు రావడం సహజం. అందుకే ఎంత రాత్రి అయినా మేకప్‌ను పూర్తిగా తొలగించుకుని నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఘటన మరోసారి సోషల్ మీడియా ఎఫెక్ట్‌పై మనల్ని ఆలోచనలో ముంచుతోంది. లైక్స్, వ్యూస్, ఫేమ్ కోసం ప్రాణాలతో ఆటలాడటం ఎంత ప్రమాదకరమో చెప్పకనే చెప్పింది. వినోదం పేరుతో చేసే ప్రతి ప్రయత్నంలో భద్రత, ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరిగా ఉండాలని అందరికీ గుర్తుండాలి. తైవాన్ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఇది ఒక గుణపాఠం కావాలి.. ఇకపై మరొకరు ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనకుండా ఉండాలంటే, మేము చూసే కంటెంట్‌ను, ఫాలో అయ్యే వ్యక్తులను కూడా జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది.
