రాణా ఈజ్ నాట్ ఏ మ్యాన్: రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు
ఈ క్రమంలోనే తాజాగా కరడుగట్టిన ఉగ్రవాది.. ముంబై పేలుళ్ల మారణహోమం నిందితుడు తహవ్వూరు హుస్సేన్ రాణాను అమెరికా నుంచి తీసుకువచ్చారు.
By: Tupaki Desk | 12 April 2025 8:00 PM ISTప్రపంచ దేశాల్లో ఇప్పుడు భారత్ ఒక ఐకాన్. పాలన పరంగా కావొచ్చు.. ఉగ్రవాదులు, తీవ్ర వాదుల విష యంలో కావొచ్చు... దైత్య పరమైన విధానాలు కావొచ్చు.. భారత్ వైపు ఇప్పుడు ప్రపంచం చూస్తోందన్న ప్రధాని నరేంద్ర మోడీ మాట అక్షర సత్యం. ఈ క్రమంలోనే తాజాగా కరడుగట్టిన ఉగ్రవాది.. ముంబై పేలుళ్ల మారణహోమం నిందితుడు తహవ్వూరు హుస్సేన్ రాణాను అమెరికా నుంచి తీసుకువచ్చారు. ఈయన విచారణ సాగాల్సి ఉంది.
అయితే.. రాణా నెటవర్క్ విషయం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారని.. అమెరికా మీడియా పేర్కొన్నట్టే అది వాస్తవమని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా రాణా కోసం ప్రాణం ఇచ్చేవారు ఉన్నారని మన నిఘా వర్గాలు పసికట్టాయి. ఆయనపై సైద్ధాంతికంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా.. ప్రేమ కురిపించే అతి వాదులు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఏ మూల నుంచి ఎవరు ఎప్పుడు ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా ఆశ్చర్యం లేదన్న విషయాన్ని ఐబీ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం చేరవేశాయి.
``రాణా ఈజ్ నాటోన్లీ ఎక్సట్రమిస్ట్. హీ ఈజ్ ఏ గాడ్ టు హిజ్ ఫాలోవర్స్`` అని ఐబీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ.. కేంద్ర హోం శాఖ అత్యవసర సందేశం పంపించింది. పోలీసు వ్యవస్థలను అప్రమత్తంగా ఉంచాలని.. ఇంటిలిజెన్స్ వర్గాలను మరింత అప్రమత్తం చేయాలని కోరింది. అంతేకాదు.. తీర ప్రాంత రాష్ట్రాలైన గుజరాత్, ముంబై, ఏపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు నిరంతర నిఘాను ముమ్మరం చేయాలని.. సెలవులు క్యాన్సిల్ చేయాలని కూడా ఆదేశించడం గమనార్హం.
అదేసమయంలో దేశంలో ఎక్కడైనా సరే.. వచ్చే 48 గంటల వరకు అన్ని ప్రభుత్వాలు అప్రమత్తగా ఉండాలన్న కేంద్రం.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని హెచ్చరించింది. మరీ ముఖ్యంగా రైల్వేశాఖను అప్రమత్తం చేసింది. రైళ్లను దారి మళ్లించడం.. హైజాక్ చేయడం వంటివి జరిగే అవకాశం ఉందని.. డ్రోన్, ఐఈడీతో దాడులు జరగవచ్చని హెచ్చరించడం గమనార్హం.
