26/11 అటాక్... ఉగ్రవాది పగలబడి ఎందుకు నవ్వాడో తెలుసా?
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) సంస్థ ప్రధాన కార్యాలయంలోని అత్యంత భద్రతా గదిలో తహవూర్ రాణాను అధికారులు ప్రశ్నిస్తున్నారు.
By: Tupaki Desk | 15 April 2025 12:27 PM ISTజాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) సంస్థ ప్రధాన కార్యాలయంలోని అత్యంత భద్రతా గదిలో తహవూర్ రాణాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో లష్కరే తోయిబా కోసం నిఘా నిర్వహించిన పాకిస్థాన్ - అమెరికన్ డెవిడ్ హెడ్లీ 26/11 ముంబై ఉగ్రవాద కుట్ర గురించి తనకు వివరించినప్పుడు తాను ఎలా స్పందించింది స్వయంగా యూఎస్ కోర్టుకు చెప్పిన విషయం తెరపైకి వచ్చింది.
అవును... 2008 మే నెలలో ముంబై నౌకాశ్రయం చుట్టూ బోట్ ట్రిప్ ను పూర్తి చేసుకున్న అనంతరం రాణాకు హెడ్లీ ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా... తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో దాడిచేసేవారు బోట్ లో వచ్చి ల్యాండ్ కావొచ్చని హెడ్లీ తనకు చెప్పినప్పుడు, ప్లాన్ నమూనాను వివరించినప్పుడు తాను నవ్వానని రాణా యూఎస్ కోర్టులో స్వయంగా వెళ్లడించారు! ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
వాస్తవానికి ముంబై అటాక్ మిషన్ కోసం రాణానే కవర్ స్టోరీ సృష్టించేందుకు అతడిని తన ఇమిగ్రేషన్ వ్యాపార సంస్థ రీజనల్ మేనేజర్ గా హెడ్లీ చూపించాడు. ఈ సమయంలో అతడిని ముంబైకి పంపించేందుకు తన సంస్థలోని ఓ వ్యక్తిని నియమించి, అతడి వివరాలను దాచిపెట్టాడు. ప్రస్తుతం అతడు కూడా ఎన్.ఐ.ఏ. రాడార్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో... ముంబై దాడుల వరకూ సుమారు ఐదు సార్లు ఉగ్ర క్యాంపులకు హెడ్లీ హాజరైనట్లు కోర్టులో అంగీకరించాడు. ఆ సమయంలోనే.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముంబైలో ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ తెరవాలని హెడ్లీకి ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు సూచించారు. ఇదే విషయాన్ని తర్వాత రాణాకు హెడ్లీ చెప్పాడు. ఆ తర్వాతే ముంబైలో ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ ఆఫీసును తెరిచేందుకు రాణా అంగీకరించాడని యూఎస్ దర్యాప్తులో వెల్లడైంది!
కాగా... ఎన్.ఐ.ఏ. 18 రోజుల పాటు జరిపే విచారణలో ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్ జాతీయులు ఇలియాస్ కశ్మీరీ, అబ్దుర్ రెహమాన్ పాత్ర గురించి కూడా తెలుసుకుఇనే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో.. కీలక కుట్రదారులు జకీర్ రెహమాన్ లఖ్వీ, సాజిద్ మజీద్ మీర్ పాత్రపైనా అతడిని ప్రశ్నించే అవకాశం ఉంది.