బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి...కాంగ్రెస్ కి బిగ్ షాక్ ?
కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టనున్నారా అంటే జరుగుతున్న ప్రచారం చూస్తే అదే నిజం అంటున్నారు.
By: Tupaki Desk | 17 March 2026 12:03 AM ISTకాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టనున్నారా అంటే జరుగుతున్న ప్రచారం చూస్తే అదే నిజం అంటున్నారు. చాలా కాలంగా ఆయన పార్టీలో సాగుతున్న పోకడల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దాంతో ఆయన సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ ని వీడే క్రమంలో జీవన్ రెడ్డి కొన్ని సంకేతాలు ఇచ్చేశారు అంటున్నారు. జగిత్యాలలోని తన ఇంటి ముందు ఆయన కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు. అలాగే కాంగ్రెస్ రంగులు జెండాలు ఎక్కడా కనబడకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ముహూర్తం ఫిక్స్ :
ఇదిలా ఉంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు. ఆయన ఈ నెల 25న దాదాపుగా వేయి మంది అనుచరులతో బీఆర్ ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. దాంతో ఆయన పార్టీ మారడం దాదాపుగా ఖాయమైంది అని అంటున్నారు. ఇక ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పెద్దల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇపుడు పార్టీ రంగులు గుర్తుకు అన్నీ చెరిపేస్తున్న నేపథ్యం ఉంది. దాంతో జీవన్ రెడ్డి పార్టీకి దూరం అవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది.
టీడీపీ నుంచి రాజకీయం:
ఇదిలా ఉంటే జీవన్ రెడ్డి రాజకీయంగా సీనియర్ లీడర్. ఆయన 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున జగిత్యాల ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి 1984 ఎపిసోడ్ లో నాదెండ్ల భాస్కరరావు వైపు వెళ్ళారు. అలా ఆయన మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నెల రోజుల పాటు నిర్వహించారు. 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. తిరిగి 1989లో ఆయన 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 1996 ఉప ఎన్నికలో గెలిచిన ఆయన 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో వరసగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు.
వైఎస్సార్ మంత్రివర్గంలో :
ఈఅ జీవన్ రెడ్డి 2004 మే 14 నుండి 2009 మార్చి 2 వరకు వైఎస్సార్ మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. అలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018, 2023 ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగా ఓటమి పాలు అయ్యారు.
