Begin typing your search above and press return to search.

బుర్ఖా వేసుకుంటే ఇకపై ఫైన్... పార్లమెంట్ ఆమోదం!

అవును... మహిళల వస్త్రధారణ విషయంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By:  Tupaki Desk   |   21 Sep 2023 5:30 PM GMT
బుర్ఖా వేసుకుంటే ఇకపై ఫైన్... పార్లమెంట్  ఆమోదం!
X

ఇకపై మహిళలు బుర్ఖా ధరించడం కానీ.. లేదా, మరో వస్త్రంతో ముఖాన్ని కప్పివేయడం కానీ చేస్తే ఇకపై అది నేరంగా పరిగణింపబడుతుంది. ఈ మేరకు బుర్ఖాలను నిషేధించే బిల్లుకు పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే దీనిని కొంతమంది వ్యతిరేకించినప్పటికి అనుకూలంగా 151 వ్యతిరేకంగా 29 ఓట్లతో దీనికి గణనీయమైన మద్దతు లభించింది.

అవును... మహిళల వస్త్రధారణ విషయంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొంతమంది ముస్లిం మహిళలు ధరించే బురఖాలతో సహా ముఖ కవచాలపై నిషేధాన్ని విధించింది. ఈ మేరకు బుర్ఖాలను నిషేధించే బిల్లుకు పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఎగువ సభ ఆమోదించిన ఈ చట్టాన్ని రైట్ వింగ్ పాపులిస్ట్ స్విస్ పీపుల్స్ పార్టీ సమర్థించింది.

వాస్తవానికి రెండేళ్ళ క్రితమే స్విట్జర్లాండ్ దేశ వ్యాప్తంగా ఈ విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే నిఖాబ్‌, బురఖా, కొంతమంది నిరసనకారులు ధరించే స్కీ మాస్క్‌ వంటివాటిపై నిషేధం విధించడం మంచిదని 51% మంది స్విస్ ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో దీన్ని చట్టంలా మార్చాలని స్విస్ ప్రభుత్వం ఫిక్స్ అయ్యింది.

ఈ క్రమంలో తాజాగా పార్లమెంట్ ఆమోదం పొందింది. ఇక దీనిని ముస్లిం సమూహాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ చట్టాన్ని అతిక్రమిస్తే భారీ జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రూల్స్ ను అతిక్రమిస్తే గరిష్టంగా 1,000 స్విస్ ఫ్రాంక్‌ (సుమారు రూ.91,000)ల వరుకు జరిమానా విధిస్తారు.

2011లో ఐరోపాలో బహిరంగ ప్రదేశాల్లో బుర్కాను నిషేధించిన మొదటి దేశాలు ఫ్రాన్స్, బెల్జియం కాగా... ఆ తర్వాత 2016లో బల్గేరియా, 2017లో ఆస్ట్రియా, 2018లో డెన్మార్క్ లు ఉన్నాయి. ఈ దేశాలలో "ముఖ లక్షణాలను గుర్తించలేని విధంగా" సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే పబ్లిక్, ప్రైవేట్ ప్రదేశాలలో ఒకరి ముఖాన్ని కప్పి ఉంచడం చట్టవిరుద్ధం!