Begin typing your search above and press return to search.

వారు ఆఫీసుకు రాకపోయినాపూర్తి వేతనం.. లెక్కలివే!

ఆఫీసుకు రాకపోయినా కొన్ని ప్రాతిపదికల మీద ఉద్యోగులకు వేతనం అందించే సంస్థలు స్విట్జర్లాండ్ లో ఉన్నాయి!

By:  Tupaki Desk   |   8 Jun 2025 1:00 AM IST
వారు ఆఫీసుకు రాకపోయినాపూర్తి వేతనం.. లెక్కలివే!
X

ఆఫీసుకు రాకపోయినా కొన్ని ప్రాతిపదికల మీద ఉద్యోగులకు వేతనం అందించే సంస్థలు స్విట్జర్లాండ్ లో ఉన్నాయి! అలా అని వర్క్ ఫ్రమ్ చేయడం అనుకుంటే పొరపాటే సుమా.. ఇది వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు, ప్రస్తూతి సెలవుల సమయంలో అన్నమాట! ఈ సందర్భంగా... ఆ లెక్కలు ఏమిటి.. సెలవుల్లోనూ 100% వేతనం పొందడం ఎలా.. మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దామ్..!

అవును... స్విట్జర్లాండ్ దేశంలో కంపెనీలు తమ ఉద్యోగులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా అనారోగ్య కారణాలతో ఆఫీసుకు రాలేని ఉద్యోగులకు 100% వేతనం దక్కే నిబంధనలు అక్కడ అందుబాటులో ఉన్నాయి. అయితే.. అది ఒక నిర్ధిష్ట కాలానికి మాత్రమే! దీనికి సంబంధించిన నియమాలను కార్మిక చట్టం నిర్దేశిస్తుంది.

స్విట్జర్లాండ్ లో ఉద్యోగులందరికీ కనీసం నాలుగు వారాల వార్షిక సెలవు లభిస్తుంది. ఫుల్ టైమ్ పనిచేసే ఉద్యోగులకు ఇది 20 రోజుల సెలవుకు సమానం. అయితే.. ఈ సెలవు దినాల్లో ఉద్యోగి అనారోగ్యానికి గురైతే.. వారికి మెడికల్ సర్టిఫికెట్ ఉన్నంత వరకూ వారు తమ వార్షిక సెలవును వాయిదా వేసుకోవచ్చు. ఒక ఉద్యోగి ఈ సెలవులను ఉపయోగించుకోకపోతే వచ్చే ఏడాదికి బదిలీ చేసుకోవచ్చు.

ఇక స్విట్జర్లాండ్ లోని ఉద్యోగులు పని చేయలేని స్థితిలో ఉంటే.. సిక్ లీవ్ పొందడానికి అర్హులు. అయితే.. ఈ విధానం ఎలా పనిచేస్తుందనేది హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో... ఉద్యోగి 900 రోజుల వ్యవధిలో సుమారు 730 రోజుల వరకూ వేతనంతో కూడిన సిక్ లీవ్ తీసుకోవచ్చు.

ఇందులో భాగంగా... ఉద్యోగి అనారోగ్యానికి గురైన మొతటి 30 రోజులు సంస్థ నుంచి జీతంలో 100% అందుకుంటాడు. ఇక 31 నుంచి 730 రోజుల వరకూ జీతంలోని 100 శాతాన్ని... బీమా ద్వారా 80%, సంస్థ ద్వారా 20% అందుకుంటాడు. ఒకవేళ సంస్థ వద్ద బీమా విధానం లేకపోతే... ఆ సంస్థే తమ ఉద్యోగికి 100% చెల్లింపుతో కూడిన సిక్ లీవ్ ఇవ్వాల్సి ఉంటుంది!

ఇదే సమయంలో ఉద్యోగులు తమ యజమాని వద్ద కనీసం 270 రోజులు పనిచేసినట్లయితే.. ప్రసూతి సెలవులకు అర్హులవుతారు. ఆ సమయంలో.. ఉద్యోగి సాధారణ జీతంలో 80% చొప్పున అందుకుంటారు. ఇదే సమయంలో... స్విట్జర్లాండ్ లో దత్తత సెలవులు కూడా ఉంటాయి. కాకపోతే వీటిని తల్లితండ్రులు ఇద్దరూ పంచుకోవచ్చు.

2023 నుంచి స్విట్జర్లాండ్ లో నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను దత్తత తీసుకునే ఉద్యోగులు వారి సాధారణ జీతంలో 80% చొప్పున రెండు వారాల పెయిడ్ హాలిడే పొందే హక్కును కలిగి ఉన్నారు. ఈ సెలవులను.. తల్లి, తండ్రిలో ఎవరో ఒకరే పొందగలుగుతారు. ఇద్దరూ ఒకేసారి సెలవును పొందలేరు.