Begin typing your search above and press return to search.

స్విగ్గీకి ఆర్డర్ చేస్తే.. డెలివరీకి ఆరుగురు వచ్చారట

ఇంటికి అవసరమైన వస్తువుల కోసం ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ లో ఆర్డర్ చేసిన వ్యక్తికి అనూహ్యమైన అనుభవం ఎదురైంది.

By:  Tupaki Desk   |   16 Dec 2023 5:16 AM GMT
స్విగ్గీకి ఆర్డర్ చేస్తే.. డెలివరీకి ఆరుగురు వచ్చారట
X

ఇంటికి అవసరమైన వస్తువుల కోసం ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ లో ఆర్డర్ చేసిన వ్యక్తికి అనూహ్యమైన అనుభవం ఎదురైంది. ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఆరుగురు డెలివరీ బాయిస్ వచ్చి.. వస్తువుల్ని డెలివరీ చేసిన వైనంతో కంగుతిన్నాడు. కాకుంటే.. ఒకసారి మాత్రమే డబ్బులు కట్ అయినా.. ఆరుగురు డెలివరీ చేయటంపై సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అసలేం జరిగిందంటే..

హర్యానాలోని గుర్ గామ్ కు చెందిన ప్రణయ్ అనే వ్యక్తి స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ లో కొన్ని వస్తువుల్ని ఆర్డర్ పెట్టాడు. అనంతరం అతడి డబ్బులు కట్ అయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అతడికి కొత్త టార్చర్ మొదలైంది. అతను పెట్టిన ఆర్డర్ క్యాన్సిల్ స్టేటస్ చూపించింది. మరోసారి ఆర్డర్ పెట్టినా అదే పరిస్థితి. దీంతో.. తాను ఆర్డర్ చేసిన వస్తువుల్లో కొన్నింటిని తీసేసి.. క్యాష్ ఆన్ డెలివరీగా ఆర్డర్ చేశాడు. అయినా ఫలితం లేదు.

దీంతో విసిగిపోయిన అతడు.. స్విగ్గీ యాప్ తో కాకుండా.. జెప్టో యాప్ ద్వారా తనకు అవసరమైన వస్తువుల్ని బుక్ చేసుకొని తెప్పించుకున్నాడు. ఆ తర్వాత నుంచి స్విగ్గీ డెలివరీ బాయిస్ వరుసగా ఫోన్లు చేయటంషురూ చేశారు. మొత్తంగా ఆరుగురు డెలివరీ బాయిస్ తమ వస్తువుల్ని డెలివరీ చేసి వెళ్లిపోయారు. దీంతో అతడి ఇంటికి మొత్తం 20లీటర్ల పాలు..6 కేజీ దోసెల పిండి.. ఇతర వస్తువులు డెలివరీ అయ్యాయి. దీంతో.. తన అనుభవం గురించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై పలువురు స్పందించారు. అయితే.. ఇదంతా సిగ్గ్వీ యాప్ లోని సాంకేతిక సమస్యలతో ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు.