టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు : పూర్ణచందర్ భార్య సంచలన వీడియో!
నటి, యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 30 Jun 2025 11:00 AM ISTనటి, యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పూర్ణచందర్ భార్య స్వప్న ఒక వీడియో విడుదల చేసి, తన భర్త నిర్దోషి అని, అతడిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని స్పష్టం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ టీవీ యాంకర్, జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధానంగా పూర్ణచందర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో, ఆయన భార్య స్వప్న మీడియాకు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో స్వప్న తన భర్త పూర్ణచందర్‌కు మద్దతుగా మాట్లాడారు.
‘నా భర్త చెడ్డవాడు కాదు’: పూర్ణచందర్ భార్య స్వప్న
స్వప్న తన వీడియోలో మాట్లాడుతూ "నా భర్త పూర్ణచందర్‌పై వస్తున్న ఆరోపణలు చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. అరణ్య (స్వేచ్ఛ కూతురు) చెప్పిన విషయాలు నాకు తీరని గాయంగా అనిపించాయి. అందుకే వాస్తవాలు చెప్పాలని ఈ వీడియో ద్వారా బయటికి వచ్చాను," అని తెలిపారు.
స్వేచ్ఛ, తన భర్త పూర్ణచందర్‌కు మధ్య సంబంధంపై స్వప్న సంచలన ఆరోపణలు చేశారు. "అరణ్యను పూర్ణ మా పిల్లలలాగే చూసుకున్నాడు. ఆమె స్కూల్ ఫీజులు కూడా పూర్ణే చెల్లించాడు. స్వేచ్ఛ కొంతకాలంగా పూర్ణతో సంబంధం కలిగి ఉందన్న అనుమానం వల్లనే మా మధ్య గొడవలు మొదలయ్యాయి," అని స్వప్న వెల్లడించారు.
స్వేచ్ఛపై తీవ్ర ఆరోపణలు
స్వప్న వెల్లడించిన వివరాల ప్రకారం.. స్వేచ్ఛ తరచు పూర్ణకు ఫోన్ చేస్తూ, "వాళ్లందరిని వదిలి నా వద్దకు రా," అంటూ ఒత్తిడి పెట్టేదట. పూర్ణ ఫోన్ ఎత్తకపోతే, స్వేచ్ఛ స్వప్నకే ఫోన్ చేసి, విడాకులు కావాలని, పూర్ణ తనతో కలిసి ఉండాలని కోరేదట. "స్వేచ్ఛ మా పిల్లలతో కూడా అంతే దగ్గరగా ఉండే ప్రయత్నం చేసింది. వాళ్లతో నేను అమ్మనని పిలవమని చెప్పేది. అరణ్యను మా పిల్లలు ‘అక్క’ అని పిలిచేవారు," అంటూ స్వప్న చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
- లొంగిపోయిన పూర్ణ.. విచారణ ప్రారంభం
ఆరోపణలు తీవ్రతరం కావడంతో పూర్ణచందర్ పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం అతడు రిమాండ్‌లో ఉన్నాడు. పోలీసులు న్యాయమూర్తి అనుమతితో అతడిని విచారిస్తున్నారు. ఈ విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
-స్వేచ్ఛ కుటుంబ సభ్యుల ఆరోపణలు.. స్వప్న స్పందన
ఇప్పటివరకు స్వేచ్ఛ కూతురు అరణ్య, ఆమె తండ్రి శంకర్, తల్లి శ్రీదేవి పూర్ణచందర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, పూర్ణ భార్య స్వప్న ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. "ఇది పూర్ణపై జరుగుతున్న కుట్ర మాత్రమే. వాస్తవాలు బయటకు రావాలి," అంటూ ఆమె స్పష్టం చేశారు.
స్వేచ్ఛ ఆత్మహత్య కేసు మరోసారి హైలైట్ అవుతోంది. ఒకవైపు బాధితురాలి కుటుంబం ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు పూర్ణ భార్య స్వప్న తన భర్త నిర్దోషి అని వాదిస్తున్నారు. ఈ కేసులో నిజం ఏమిటి? ఎవరి మాట నమ్మాలి? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ కేసు కోర్టులో సత్యాన్వేషణకు చేరుకోనుంది. మరిన్ని వివరాలు తెలియాలంటే పోలీసుల విచారణ, కోర్టు తీర్పు వరకు వేచి చూడాల్సిందే.
