Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ రోడ్డు.. నడుస్తూనే ఛార్జింగ్!

ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా పనులు ఈజీ అయిపోయాయి.

By:  Tupaki Desk   |   26 April 2025 2:00 PM IST
Sweden Unveils World First Permanent Electric Road to Charge
X

ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలా పనులు ఈజీ అయిపోయాయి. ఇకపోతే ఏఐ వచ్చిన తర్వాత ఎన్నో రంగాల్లో మార్పులు వచ్చాయి. ఏఐ జీవితాన్ని సులభతరం చేయగా, ఇతర టెక్నాలజీలు కూడా ఇప్పుడు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అలాగే మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ కార్లు వచ్చినప్పటి నుంచి కారు నడపడం మరింత ఈజీ అయిపోయింది. ఎలక్ట్రిక్ కార్లలో డీజిల్ లేదా పెట్రోల్ గురించి చింతించాల్సిన పనిలేదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిపోవచ్చు. అందుకే ఒక దేశం ఏకంగా తన రోడ్డునే ఎలక్ట్రిక్ మార్చింది. దాని గురించి తెలుసుకుందాం.

ఇప్పటివరకు మీరు ఎలక్ట్రిక్ కార్ల గురించి విన్నాం.. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ రోడ్డు కూడా వచ్చేసింది. స్వీడన్ ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ సంవత్సరం పర్మనెంట్ ఎలక్ట్రిఫైడ్ రోడ్డును ఓపెన్ చేయబోతుంది. ఈ రోడ్డు ప్రత్యేకత ఏమిటంటే దీనిపై నడుస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను సులభంగా ఛార్జ్ చేయవచ్చు. ఈ యూరోపియన్ దేశం దాదాపు 3000 కిలోమీటర్ల మేర రోడ్డును ఎలక్ట్రిఫైడ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల కోసం బలమైన ఎకోసిస్టమ్‌ను సృష్టిస్తున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వారు ఈ రోడ్డుపై నడుస్తూనే తమ వాహనాలను ఛార్జ్ చేసుకోగలరు. దీని కోసం ఛార్జ్ చేయాల్సిన వాహనానికి ఒక మూవబుల్ ఆర్మ్‌ను అమర్చాలి. దాని ద్వారానే కారు ఛార్జ్ అవుతుంది. మూవబుల్ ఆర్మ్ రోడ్డులో అమర్చిన ట్రాక్‌కు కనెక్ట్ అవుతుంది. దానిపై నుండి వెళ్ళే వాహనం బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇలాంటి రోడ్డును నిర్మించడానికి ఒక కిలోమీటరుకు 1.2 మిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. ఈ రోడ్డు ప్రత్యేకత ఏమిటంటే దీని పైభాగంలో విద్యుత్ ఉండదు. దానిపై చెప్పులు లేకుండా కూడా నడవవచ్చు.