ఎమ్మెల్యేల కోసం బాబు భారీ యాక్షన్ ప్లాన్!
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ నెల 12తో ఏడాది పూర్తి అవుతోంది. ఈ నేపధ్యంలో కూటమి సారధి ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు.
By: Tupaki Desk | 11 Jun 2025 4:00 AM ISTటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ నెల 12తో ఏడాది పూర్తి అవుతోంది. ఈ నేపధ్యంలో కూటమి సారధి ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. మొత్తం 26 జిల్లాలలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రత్యేక ఆఫీసులను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇక్కడ స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లను చంద్రబాబు ప్రారంభిస్తారు.
ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ప్రతీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాటిని నోడల్ కేంద్రంగా మార్చేందుకు అధికారులతో పాటు నిపుణులు కూడా నిరంతరం ఆ ఆఫీసులలో అందుబాటులో ఉంటారు అని ప్రకటించారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలకు వారి సొంత కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. దీని వల్ల ఆ కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 నోడల్ అధికారి, అలాగే జిల్లా కలెక్టర్ ఆయా నియోజకవర్గంలోని సమస్యలను ఎప్పటికపుడు చర్చించి పరిష్కరించడానికి వీలు అవుతుందని అన్నారు.
ఇక ఎమ్మెల్యేలు ఎవరికీ ఇప్పటిదాకా బస చేయడానికి ఒక స్థలం ఏదీ లేదని బాబు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఆఫీసులలోనో లేదా ప్రభుత్వ అతిధి గృహాలలోనే బస చేయడమే జరుగుతోందని అన్నారు. దాంతో తాను వినూత్న ఆలోచనలతో ప్రతీ అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ లో ఆఫీసుని ఏర్పాటు చేయిస్తామని చెబుతున్నారు.
అంతే కాదు స్వర్ణాంధ్ర విజన్ 2047 అంటే చాలా కీలకమైన అంశాల మీద ప్రత్యేక ఫోకస్ పెడతారు. వాటిని రానున్న కాలంలో పరిష్కరిస్తారు. అలా ఆయా నియోజకవర్గాలను యూనిట్ గా తీసుకుని పనిచేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతే కాదు అభివృద్ధి కూడా క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతుంది.
అలా ప్రభుత్వం మరింత దగ్గరగా ప్రజల వద్దకు వెళ్ళినట్లు అవుతుంది. ఇక మంత్రులకు మాత్రమే ఇప్పటిదాకా ప్రత్యేక ఆఫీసులు అధికారులు ఉండేవి. ఇపుడు ఎమ్మెల్యేలకు ఆ హోదా ఇవ్వడం వల్ల వారి కలెక్టర్ సహా కీలక శాఖలకు చెందిన జిల్లా అధికారులు అంతా ఎమ్మెల్యేలతో కలసి పనిచేయడం వల్ల సమస్యలు కూడా చాలా త్వరగా పరిష్కారం అవుతాయని అంటున్నారు. ఎమ్మెల్యేలు సైతం తమ పదవికి ఒక హోదా గౌరవం పొందిన అనుభూతిని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తారు అని అంటున్నారు.
అంతే కాదు ఈ తరహా ఎమ్మెల్యే కార్యాలయాలలో రాష్ట్రప్రభుత్వం నియమించిన వారందరితో సమన్వయం చేసుకోవడం కలెక్టర్ తో పాటు ఆయా ఎమ్మెల్యే బాధ్యతగా ఉంటుంది. ఇదే ఆఫీసులో సచివాలయాల నుండి ఐదుగురు ఉద్యోగులతో కూడిన ప్రత్యేక బృందం కూడా అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. అంతే కాదు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసే ప్రతి స్వర్ణాంధ్ర 2047 యూనిట్‌కు నియోజకవర్గ ఎమ్మెల్యే చైర్మన్‌గా,జిల్లా అధికారి నోడల్ అధికారిగా ఉంటారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడానికి 10 లక్షల రూపాయలు విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ విధంగా సకల సదుపాయాలను ఎమ్మెల్యేలకు అందిస్తారు. వారు చేయాల్సిందల్లా తమ నియోజకవర్గ పరిధిలో ఆరోగ్యకరమైన వాతావరణం అలాగే సంపన్న వంతమైన సమాజాన్ని సంతోషమయమైన ప్రాంతాన్ని నిర్మించడమే లక్ష్యంగా చేసుకోవాలని అంటున్నారు. ఈ విధంగా వారు ఎక్కడికక్కడ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకుని దానిని 2029 నాటికి సాధించేందుకు కృషి చేయాలని బాబు టార్గెట్లు పెడుతున్నారు.
అంతే కాదుజ్ ప్రభుత్వ-ప్రైవేట్-ప్రజల భాగస్వామ్యం పీ 4 పేరుతో ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది నిరంతరంగా సాగే కార్యక్రమం అని ముఖ్యమంత్రి చెప్పారు. ఫ్4 కార్యక్రమం ద్వారా ఆర్థికాభివృద్ధి పేదరిక నిర్మూలన లక్ష్యంగా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. ఇల ప్రతీ ఎమ్మెల్యే కూడా తన సొంత లక్ష్యాలని అలాగే సొంత నెట్‌వర్క్‌ను నిర్మించుకోవాలని చంద్రబాబు కోరుతున్నారు. అంతే కాదు ఎవరికి వారు వారి నియోజకవర్గాల అభివృద్ధికి సహాయపడటానికి మేధో సంపత్తి కలిగిన బృందాలను ఎంపిక చేసుకుని ముందుకు సాగాలని కోరుతున్నారు. నిజంగా ఇది వినూత్నమైన కార్యక్రమంగా ఉంది అని చెప్పాలి.