Begin typing your search above and press return to search.

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఆదోని చైర్‌పర్సన్ స్థానం టీడీపీకి కేటాయించారు. దీంతో జనసేనకు చెందిన స్వప్న నాయకర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు.

By:  Tupaki Desk   |   4 Nov 2026 10:26 AM IST
ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!
X

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆదోని రాజకీయ పరిణామం ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీకి చెందిన రెబల్ అభ్యర్థి స్వప్న నాయకర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఓడించి మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.

కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఆదోని చైర్‌పర్సన్ స్థానం టీడీపీకి కేటాయించారు. దీంతో జనసేనకు చెందిన స్వప్న నాయకర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఉంగరం గుర్తుపై పోటీ చేసిన ఆమెకు ఓటర్లు పట్టం కట్టారు. టీడీపీ అభ్యర్థి పి. నాగమణి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జి. ప్రణీతపై 2,061 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఈ ఫలితం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు చెందిన అభ్యర్థి, అధికార కూటమి నిర్ణయానికి భిన్నంగా స్వతంత్రంగా పోటీ చేసి గెలవడం ప్రత్యేకతను సంతరించుకుంది.

ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ఆదోనిలో ఈ విజయం సాధించడం జనసేన స్థానిక శ్రేణుల్లో ఆసక్తిని పెంచింది. పార్టీ అధికారిక అభ్యర్థిగా కాకుండా రెబల్‌గా పోటీ చేసినప్పటికీ ప్రజల మద్దతు పొందడం ఈ ఎన్నికల్లో కీలక పరిణామంగా నిలిచింది.

మొత్తంగా ఆదోని మున్సిపల్ ఎన్నికల ఫలితం స్థానిక రాజకీయ సమీకరణాలపై కొత్త చర్చకు తెరలేపింది.