Begin typing your search above and press return to search.

స్వచ్ఛ సర్వేక్షన్ 2024-25... టాప్ 10 పరిశుభ్ర, అపరిశుభ్ర నగరాలివే!

ఈ సందర్భంగా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో టాప్ - 10 పరిశుభ్ర నగరాలు, వాటి స్కోర్స్ ను పరిశీలిద్దామ్..!

By:  Tupaki Desk   |   18 July 2025 3:24 PM IST
స్వచ్ఛ సర్వేక్షన్  2024-25... టాప్ 10 పరిశుభ్ర, అపరిశుభ్ర నగరాలివే!
X

దేశంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడానికి, నగరాల మధ్య స్వచ్ఛత విషయంలో పోటీ పెంచడానికి కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు ఇస్తోంది. వీటిని ఈసారి ఐదు కేటగిరీలుగా విభజించారు. ఇందులో భాగంగా... 20వేల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు.. 20 - 50 వేల మధ్య జనాభా కలిగిన నగరాలు.. 50వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్న నగరాలు.. 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాలతో పాటు.. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన సిటీలుగా విభజించారు.

ఈ జాబితాలో 'స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25' అవార్డులలో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా అహ్మదాబాద్ ఎంపికైంది. 10 లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో అగ్రస్థానంలో నిలిచినందుకు న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో అహ్మదాబాద్‌ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డును అందజేశారు. ఆ తర్వాత స్థానంలో భోపాల్, లక్నో ఉన్నాయి. మహాకుంభ్ సందర్భంగా వ్యర్థాల నిర్వహణకు ప్రయాగ్‌ రాజ్ మున్సిపల్ కార్పొరేషన్‌ కు ప్రత్యేక అవార్డు కూడా లభించింది.

ఇదే సమయంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ దాని ఆదర్శప్రాయమైన పారిశుద్ధ్య ప్రయత్నాలకు ఉత్తమ కంటోన్మెంట్ బోర్డుగా సత్కరించబడగా... పారిశుద్ధ్య కార్మికుల భద్రత, గౌరవం పట్ల అత్యుత్తమ నిబద్ధతకు విశాఖపట్నం (జీవీఎంసీ)కి స్పెషల్ అవార్డ్ లభించింది. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద ఏర్పాటు చేయబడిన ఈ అవార్డులను 2016లో 73 నగరాలతో ప్రారంభించగా.. ఈ సంవత్సరం 4,589 నగరాలు ఈ సర్వేలో ఉన్నాయి.

ఈ సందర్భంగా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో టాప్ - 10 పరిశుభ్ర నగరాలు, వాటి స్కోర్స్ ను పరిశీలిద్దామ్..!

1. అహ్మదాబాద్ - 12079

2. భోపాల్ - 12067

3. లక్నో - 12001

4. రాయ్ పూర్ - 11996

5. జబల్ పూర్ - 11989

6. గ్రేటర్ హైదరాబాద్ - 11805

7. పింప్రి చించ్వాడ్ - 11782

8. పూణె - 11653

9. జీవీఎంసీ విశాఖపట్నం - 11636

10. ఆగ్రా - 11532

ఇదే సమయంలో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో టాప్ - 10 అపరిశుభ్ర నగరాలు, వాటి స్కోర్స్ ను పరిశీలిద్దామ్..!

40. మదురై - 4823

39. లుథియానా - 5272

38. చెన్నై - 6822

37. రాంచీ - 6835

36. బెంగళూరు (బీబీఎంపీ) - 6842

35. ధన్ బాద్ - 7196

34. ఫరిదాబాద్ - 7329

33. గ్రేటర్ ముంబై - 7419

32. శ్రీనగర్ - 7488

31. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ - 7920