Begin typing your search above and press return to search.

రెండు సీట్లుగా పిఠాపురం... కర్చీఫ్ తో వర్మ రెడీ

పిఠాపురం వర్మగా గత రెండేళ్ళుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రాచుర్యం పొందిన ఎస్వీఎస్ఎన్ వర్మ మూడేళ్ళకు ముందే కర్చీఫ్ వేసేసారు.

By:  Satya P   |   15 April 2026 11:00 AM IST
రెండు సీట్లుగా పిఠాపురం... కర్చీఫ్ తో  వర్మ  రెడీ
X

పిఠాపురం వర్మగా గత రెండేళ్ళుగా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రాచుర్యం పొందిన ఎస్వీఎస్ఎన్ వర్మ మూడేళ్ళకు ముందే కర్చీఫ్ వేసేసారు. 2029 లో కచ్చితంగా పోటీకి రెడీ అని సిగ్నల్స్ ని పంపేసారు. తనకు టికెట్ రాకుండా ఈసారి ఏ శక్తీ అడ్డుకోలేదని ధీమాగా ఉన్నారు. ఇంతకీ వర్మలో అంతటి నమ్మకం కలగడానికి కారణం ఏమిటి అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. పిఠాపురం కూడా రెండుగా మారుతుందని అందులో ఒకటి తనకు దక్కుతుందని భావించి ముందే స్కెచ్ గీసే పనిలో వర్మ ఉన్నారు అని అంటున్నారు.

ఇదీ పిఠాపురం పరిస్థితి :

పిఠాపురం నియోజకవర్గం మూడు లక్షలకు పైగా జనాభాతో ఉంది. ఇక్కడ మూడు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. దాంతో కచ్చితంగా ఈ సీటు విభజనలో రెండు అవుతుందని అంటున్నారు. అయితే అలా రెండు అయ్యే సీటులో వర్మకు చాన్స్ ఉంటుందా అన్నదే చర్చ. టీడీపీ అధినాయకత్వం ఆయనకు టికెట్ ఇవ్వాలనుకున్నా రెండవ సీటు మహిళలకు కేటాయిస్తే వారికి రిజర్వేషన్ అయితే అప్పుడు సంగతేంటి అన్న చర్చ కూడా వస్తోంది. అయితే దానికి కూడా వర్మ విరుగుడు మంత్రం కనిపెట్టేశారు అని అంటున్నారు.

ఫ్యామిలీ ప్యాక్ తోనే :

వర్మ ఎంత తెలివిగా అడుగులు వేస్తున్నారు అంటే తాజాగా జరిగిన పార్టీ కొత్త ఆఫీసు ఓపెనింగ్ కి ఆయన తన సతీమణితో కుమారుడితో కలిసి హాజరయ్యారు. ఈ విధంగా క్యాడర్ కి వారిని ముందే పరిచయం చేసేసారు. పిఠాపురం రెండవ సీటు మహిళలకు రిజర్వ్ అయితే తన భార్య చేత పోటీ చేయించడానికి వర్మ ప్రిపేర్ అయిపోయారని అంటున్నారు. అలా కాకుండా యువతకు అవకాశం అని టీడీపీలో అంటే తన కుమారుడు గిరీష్ ని సిద్ధం చేస్తున్నారుట, ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు తమ కుటుంబం చేజారిపోకుండా చూసుకుంటూ చాలా తెలివిగానే ఆయన అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.

జనసేన సైతం :

అయితే మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో బలోపేతం అయిన జనసేన రెండవ సీటు వస్తే పోటీ పడకుండా ఉంటుందా అన్నదే అసలైన ట్విస్ట్. ఎందుకంటే 2024 లో కేవలం 21 సీట్లకే పరిమితం అయిన ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో రెట్టింపు సీట్లకు పోటీ చేస్తుందని అంటున్నారు అలా తమకు బలమున్న సీట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. తాము ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లలోనే రెండు అయితే ఆ సీట్లనే తీసుకుంటే తమకు గెలుపు సులువు అవుతుందని జనసేన నేతలు అంటున్నారు. అది సహజమైన డిమాండ్ అని కూడా అంటున్నారు క్యాడర్ లీడర్ ఉన్న చోట వదిలేసుకుని కొత్త సీట్లో రిస్క్ చేయరు కదా అని అంటున్నారు ఆ విధంగా జనసేన చూపు కూడా రెండవ సీటు మీద ఉంది అని అంటున్నారు. దాంతో వర్మ వర్సెస్ జనసేన కంటిన్యూ అవుతుందా ఎక్కువ సీట్లు వచ్చినా వర్మకు పోటీకి రూట్ క్లియర్ అవుతుందా లేదా అన్నదే చర్చగా ఉంది మరి.