Begin typing your search above and press return to search.

మమత బెనర్జీ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్న సువేందు !

ఇపుడు ఏకంగా మమత పాలనకు గురుతులుగా ఉన్న వాటిని కరిగించి కనుమరుగు చేసే పనిలో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం ఫుల్ బిజీగా ఉంది.

By:  Satya P   |   24 May 2026 5:00 AM IST
మమత బెనర్జీ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్న సువేందు !
X

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఒకనాటి ప్రియ శిష్యుడు ఈనాటి ప్రత్యర్ధి ముఖ్యమంత్రి అయిన సున్వేందు అధికారి పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే వరసగా మమతా బెనర్జీ గుర్తులు చెరుపుకుంటూ పోతున్నారు. మమత పాలనలో అక్రమాలు అవినీతి అని రెండు విచారణ కమిషన్లు వేశారు. వీలైనంత వరకూ తృణమూల్ కాంగ్రెస్ ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఇపుడు ఏకంగా మమత పాలనకు గురుతులుగా ఉన్న వాటిని కరిగించి కనుమరుగు చేసే పనిలో బెంగాల్ బీజేపీ ప్రభుత్వం ఫుల్ బిజీగా ఉంది.

భారీగానే షాకులు :

మమతకు అధికారం పదిహేళ్ళుగా అప్రతిహతంగా బెంగాల్ లో సాగింది. కానీ ఇపుడు మాజీ అయిపోయారు. ఇది జీర్ణించుకోలేని విషయం. అయితే దానికి తోడు అన్నట్లుగా సువేందు అధికారి భారీ షాకులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారి అవినీతిని వెలికి తీసేల కేంద్ర సంస్థలు ఈడీ ఐటీ దాడులు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. అవి చాలవన్నట్లుగా మమతా బెనర్జీకి మద్దతుగా నిలిచిన ఇతర రంగాల ప్రముఖులను కూడా ఏ మాత్రం వదలడంలేదు. ఇలా వరసగా కేసులు నమోదు చేస్తూ పోతున్న క్రమం ఒక వైపు ఉంటే మరో వైపు మమత పాలనకు చిహ్నాలుగా ఉన్న వాటిని కూడా తొలగించే కార్యక్రమం మొదలైంది.

నామ రూపాలు లేకుండా :

మమతా బెనర్జీ హయాంలో నిర్మించిన ఒక భారీ విగ్రహాన్ని సువేందు అధికారి ప్రభుత్వం నేల కూల్చింది. అంతే కాదు నామ రూపాలు లేకుండా చేసింది. ట్ బాల్ థీమ్డ్ విగ్రహంగా ఇది ఉంది. ఇక ఇప్పటికి తొమ్మిదేళ్ళ క్రితం 2017లో ఫీఫా అండర్-17 ప్రపంచ కప్‌కు ముందు సాల్ట్ లేక్ స్టేడియం వీవీఐపీ గేట్ సమీపంలో దీనిని నిర్మించి ఉంచారు. విగ్రహం పైన విశ్వ బంగ్లా అన్న లోగోని కూడా ఉంచడం జరిగింది. అయితే ఉన్నట్లుండి ఈ విగ్రహాన్ని తాజాగా మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు తొలగించడంతో బెంగాల్ రాజకీయం ఒక్క సారిగా వేడెక్కినట్లు అయింది. ఇది ఒక చారిత్రాత్మకమైన గుర్తింపు అని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. దానిని తొలగించారని మండిపడుతోంది. ఇది క్రీడా చరిత్రలో ఒక ముగిసిన అధ్యాయం అని అంటున్నారు.

విగ్రహం చుట్టూ వివాదం :

ఇదిలా ఉంటే ఈ విగ్రహం చుట్టూ వివాదాలే ఉన్నాయని అంటున్నారు. ఈ విగ్రహం విషయంలో జనాల అభిప్రాయం కూడా రెండుగా ఉందని చెబుతున్నారు. ఇది మొండెం లేని విగ్రహం అని ఒక ఫుట్ బాల్ ప్లేయర్ రెండు కాళ్ళూ నడుము మాత్రమే కనిపించేలా దీనిని నిర్మించారని అంటున్నారు. ఇక మొండెం స్థానంలో ఒక ఫుట్ బాల్ ని ఉంచిన వైనమూ వివాదస్పందంగా ఉంది అని అంటున్నారు. అయితే దీని వెనకాల థీం ని చూడాలని అన్న వారూ ఉన్నారు. శరీరం మొత్తం ఫుట్ బాల్ కి అంకితం చేయడం అన్న స్పూర్తి కోసమే దీనిని ఇలా డిజైన్ చేయించారు అని కితాబు ఇచ్చిన వారూ ఉన్నారు.

మమతకు గడ్డు కాలం :

విగ్రహం తొలగింపుతో మమతకు గడ్డు కాలం మొదలైంది అని అంటున్నారు. మాజీ సీఎం మీద రానున్న రోజులలో మరిన్ని కేసుల ఉచ్చు బిగుస్తుందని కూడా అంటున్నారు. మమతను తేలికగా వదిలిపెట్టరని ఏకంగా పదిహేనేళ్ళ పాటు పాలించిన ఆమె ప్రభుత్వంలో అనేక అంశాలను వెలికి తీస్తారని అంటున్నారు. తాజాగా బెంగాల్ సీఎం సువేందు అధికారి ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలతో సుదీర్ఘమైన భేటీలు నిర్వహించి వచ్చారు. దాంతో తరువాత యాక్షన్ ఏమిటి ఎవరి మీద అన్న ఉత్కంఠ అయితే సర్వత్రా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.